అదొక లోపమా?

ఆంధ్రజ్యోతి(3-10-15): ప్రశ్న:లైంగిక క్రీడ కొనసాగించలేకపోవటం వల్ల గత ఆరేళ్లుగా భర్తతో నాకు సఖ్యత కొరవడింది. ఆయన 3 నిమిషాల్లో క్లైమాక్స్‌కు చేరుకుంటే అందుకు నాకు 10 నిమిషాల సమయం పడుతోంది. నెల మొత్తంలో జరిగే లైంగిక చర్యలో నేను ఏ ఒక్కసారో క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాను. ఇంత తక్కువ సమయంలో ఆయన క్లైమాక్స్‌ చేరుకోవటం అనేది ఏదైనా లోపమా? అసలు నార్మల్‌ ఇంటర్‌కోర్స్‌కు ఎంత సమయం పడుతుంది?
- రమ్య, విశాఖపట్టణం

జవాబు:లైంగిక క్రీడ కొనసాగించి క్లైమాక్స్‌కు చేరుకునే సమయం పురుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అలాగే వివిధ కారణాలు, పరిస్థితుల (సెక్స్‌ టెన్షన్‌, సెక్స్‌లో పాల్గొనే ఫ్రీక్వెన్సీ) వల్ల సంభోగ సమయం మారుతూ ఉంటుంది. మీ భర్త విషయానికొస్తే సాధారణ పురుషులకంటే ఆయన సంభోగ సమయం తక్కువని తెలుస్తోంది. లైంగిక సంబంధాల్లో ముఖ్యమైనది ‘ఫోర్‌ ప్లే’, అంగ ప్రవేశానికి ముందు తగినంత ‘లైంగిక ప్రేరణ’ను అందించటం. చాలామంది పురుషులకు స్త్రీలను లైంగిక చర్యకు సిద్ధం చేయాలంటే ఎక్కువ సమయంతో పాటు ప్రేరేపించాలనే విషయం తెలియదు. ఇక మీ విషయంలో త్వరగా క్లైమాక్స్‌కు చేరుకోవటానికి కొంత భిన్నమైన ప్రేరణ విధానాన్ని అనుసరించాల్సి ఉండొచ్చు. దంపతులిద్దరూ సమానంగా లైంగిక సంతృప్తి పొందాలంటే లైంగిక మెలకువలు తెలుసుకుని వాటిని అనుసరించాలి. ఇలా చేస్తే ఇద్దరూ ఒకే సమయంలో క్లైమాక్స్‌కు చేరుకోగలుగుతారు. అప్పుడు అసంతృప్తికి చోటుండదు.

 
 
డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.