ఆ ప్రయోగాలు ఇబ్బందిపెడితే?

ఆంధ్రజ్యోతి(21-11-15):ప్రశ్న: నాకు మావారికి సెక్స్‌ అంటే చాలా ఇష్టం. అయితే పని ఒత్తిడి, అలసట వల్ల ఈమధ్య సెక్స్‌లో అంతగా ఆసక్తి చూపించలేకపోతున్నాను. దానికితోడు మావారు ఆ సమయంలో కొంత మొరటుగా వ్యవహరిస్తారు. రకరకాల పొజిషన్లలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకు నేను అభ్యంతరం చెబితే విసుక్కుంటారు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేయాలో అర్థం కావటం లేదు?

జవాబు: సమయానికి వర్క్‌ ముగించుకుని మీ వారి కోసం సమయాన్ని కేటాయించండి. అది అవసరం కూడా! మీ బిజీ షెడ్యూల్‌లో ముఖ్యమైన క్లయుంట్‌ కోసం సమయాన్ని కేటాయించినట్టే మీవారితో గడపటానికి కూడా సమయాన్ని కేటాయించండి. అందుకోసం కొన్ని గంటలు లేదా రోజులు సర్దుబాటు చేసుకుని ఆయనకు వీలైనంత దగ్గరగా మసలండి. మీవారి మొరటు ప్రవర్తన మీకు అసౌకర్యం కలిగిస్తుంటే ఆ విషయాన్ని తెలియజేయండి. మీకు ఎలా ఉంటే ఇష్టమో, ఎలాంటి చర్యలు ఆనందం కలిగిస్తాయో చెప్పండి. అలాగే మీకు నొప్పి కలగని సెక్స్‌ పొజిషన్స్‌ గురించి ఆయనకు తెలియజేయండి. అలా ఇద్దరు ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా వేర్వేరు సెక్స్‌ పొజిషన్స్‌లో ప్రయోగాల గురించి ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకోండి. ఇలాంటి సెన్సిటివ్‌ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ అందులో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా సెక్సాలజి్‌స్టని సంప్రదించండి.

డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌