ఆ ‘ధోరణి’ని భరించేదెలా?

ఆంధ్రజ్యోతి(10-10-15): ప్రశ్న: ఈమధ్య నా భర్తలో లైంగికపరంగా ఎంతో మార్పొచ్చింది. సెక్స్‌ విషయంలో ఆయన విపరీత ధోరణి కనబరుస్తున్నారు. ఆయన బలవంతం మీద నగ్నంగా ఫొటోలు తీయించుకోవటంలాంటి కొన్ని పనులకు కూడా ఒప్పుకొన్నాను. అయినా ఆయన కోరికలకు అంతే లేకుండా పోతోంది. ఈ రకమైన ఆయన ప్రవర్తన నాకు చిరాకు తెప్పిస్తోంది. ఒత్తిడికి గురిచేస్తోంది. నేనేం చేయను? 

జవాబు:సెక్స్‌లో కొత్త కొత్త ప్రయోగాలు చేయటం గొప్ప అనుభవం. అయితే సెక్స్‌ విషయంలో ఊహలు, కోరికలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. మిమ్మల్ని మీ భర్త సెక్సీలా చూడాలనుకోవటంలో తప్పు లేదు. హై హీల్స్‌, సెక్సీ దుస్తులు వేసుకోమన్నంత మాత్రాన ఆయన మిమ్మల్ని కేవలం సెక్స్‌ డాల్‌గా చూస్తున్నారని మీరు భావించనవసరం లేదు. ఒకవేళ నిజంగానే ఆయనది విపరీత ధోరణి అని మీకనిపిస్తే రిలాక్స్‌డ్‌గా ఉన్న సమయంలో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది కలుగుతున్న విషయాల గురించి చర్చించుకుని ఇద్దరూ ఓ ఒప్పందానికి రండి. సెక్స్‌పరంగా మీకిష్టమైనట్టు ఆయన, ఆయనకిష్టమైనట్టు మీరు నడుచుకునేలా ఒప్పందం చేసుకోండి. ఈ విషయంలో మరిన్ని సలహాలు, సూచనలు కావాలనుకుంటే సెక్సాలజి్‌స్టని సంప్రదించండి.
 

డాక్టర్‌. షర్మిల మజుందార్‌

కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌

రామయ్య ప్రమీల హాస్పిటల్‌.

[email protected]