వారానికి ఒక్కసారే శృంగారం.. అసలు సమస్యేంటంటే..

ఆంధ్రజ్యోతి (28-01-2020):

 ప్రశ్న:

డాక్టర్‌! నా వయసు 43 ఏళ్లు. వారంలో ఒకసారికి మించి భార్యతో లైంగికంగా కలవలేకపోతున్నాను. రెండవసారి అంగ స్తంభనకు కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతోంది. ఇందుకు కారణం అర్థం కావడం లేదు. నాకున్న సమస్య ఎలాంటిది?

 

ఓ సోదరుడు, అద్దంకి

 

జవాబు: అంగం స్తంభిస్తోంది కాబట్టి మీకు అంగంలోని రక్తనాళాల్లో అడ్డంకులు లేవని అర్థం అవుతోంది. ఏదైనా తీవ్ర సమస్య ఉంటే అంగ స్తంభనాలు కలగవు. కానీ మీ విషయంలో అంగ స్తంభనలు ఉన్నాయి. కాబట్టి ఆందోళన పడవలసిన అవసరం లేదు. అయితే వారంలో ఒకసారికి మించి అంగం స్తంభించకపోవడానికి విటమిన్‌ డి లోపం, లేదా టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ తగ్గుదల, లేదా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం ప్రధాన కారణాలు అయి ఉండవచ్చు. కాబట్టి మీరు పరీక్షల ద్వారా అసలు కారణాన్ని కనిపెట్టి, తగ్గిన హార్మోన్లను సరిచేసుకుంటే, తిరిగి స్తంభనాలు మామూలుగా మారతాయి. వైద్యులను కలిసి పరిస్థితిని వివరించి, పరీక్షలు చేయించుకోండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)