మందులు ఎందుకు పనిచేయవు?

13-08-2019: డాక్టర్‌! నా వయసు 25. ఇంకా పెళ్లి కాలేదు. అంగం చిన్నదని నాకు అనుమానంగా ఉంది. దాంతో అంగ పరిమాణం పెంచుతామనే ప్రకటనలు ఇంటర్నెట్‌లో చూసి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మందులు, పరికరాలు తెప్పించి వాడాను. కానీ వాటితో ఎలాంటి ఫలితం దక్కలేదు. మరి నా అంగ పరిమాణం పెంచేదెలా?
ఓ సోదరుడు, హైదరాబాద్‌.
స్థంబించని స్థితిలో ఎవరి అంగమైనా చిన్నదిగానే ఉంటుంది. అలాకాకుండా, స్థంబించిన స్థితిలో అంగం మూడు అంగుళాల పొడవుకు చేరుకుంటే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అంగం పరిమాణం పెంచే మందులు ఏవీ కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదు. కాబట్టి ఇంటర్నెట్‌లో కనిపించే ప్రకటనలు చూసి మోసపోకండి. ఎంతటి ఖరీదైన మందులు, పరికరాలు కూడా అంగ పరిమాణాన్ని పెంచలేదు. మీరు కొనుగోలుచేసిన ‘ట్రాక్షన్‌ డివైజ్‌’ వల్ల అంగం సాగి పొగవు అవుతుందనేది అపోహ మాత్రమే!
 
అంగం పొడవు కౌమార స్థితిలో (13, 14 ఏళ్లు) ఉన్నప్పుడు మరీ తక్కువగా ఉందని గ్రహిస్తే, హార్మోన్‌ ఇంజెక్షన్లతో సాధారణ పొడవుకు పెంచే వీలుంటుంది. యుక్తవయసు దాటిన తర్వాత ఆ చికిత్స వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి స్థంబించిన స్థితిలో మీ అంగం పొడవు మూడు అంగుళాలు ఉంటే, అనవసరంగా ఆందోళన పడడం మానేయండి. ఒకవేళ ఆ స్థితిలో కూడా అంగం అంతకంటే తక్కువ పొడవు ఉంటే, సర్జరీతో సరి చేసే వీలుంది. ఈ సర్జరీలో ‘పినైల్‌ లెంగ్తెనింగ్‌’ అనే ప్రక్రియ ద్వారా అంగంలోని సిలిండర్‌ పొడవును పెంచుతారు. సర్జరీ తదనంతరం అంగం స్థంబించిన స్థితిలో మరో అరంగుళం నుంచి అంగుళం మేరకు పొడవు పెరిగే వీలుంటుంది. కాబట్టి మొదట మీ అంగం గురించిన అనుమాన నివృత్తి కోసం అనుభవజ్ఞులైన ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. అవసరమైతే అంగం పొడవును పెంచే సర్జరీను వైద్యులు సూచిస్తారు.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)