ఆ పరీక్ష ఎందుకు?


డాక్టర్‌! మా తమ్ముడికి పెళ్లయి మూడు నెలలు. మరదలు తమ్ముడికి మగతనం లేదని అంటోంది. వైద్యులను సంప్రతిస్తే, ‘పొటెన్సీ టెస్ట్‌’ చేయించుకోమని అంటున్నారు. పొటెన్సీ టెస్ట్‌ అంటే ఏమిటి? దీనికి ఎంత ఖర్చవుతుంది? ఈ పరీక్షతో ఉపయోగం ఏమిటి?

- ఓ సోదరి, గూడూరు.
 
పురుషుల్లో నపుసంకత్వం అనేది ఉండదు. సాధారణంగా పురుషుల్లో అంగస్తంభన సమస్య, ఇన్‌ఫెర్టిలిటీ...ఇవే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. వీటికి సమర్ధమైన చికిత్సలు ఉన్నాయి. మీ తమ్ముడి విషయంలో వైద్యులు పొటెన్సీ టెస్ట్‌ సూచించారు కాబట్టి ఆ పరీక్ష చేయిస్తే అంగస్తంభనం ఉన్నదీ, లేనిదీ తేలుతుంది. ఈ పరీక్ష గురించి భయపడవలసిన అవసరం లేదు. దీన్లో పినైల్‌ డాప్లర్‌ స్కాన్‌, హర్మోన్‌, వీర్య పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలన్నీ ఎంతో సురక్షితమైనవి. కచ్చితమైన ఫలితాలను ఇచ్చేవే! వీటికి సుమారుగా 6 నుంచి 7 వేల వరకూ ఖర్చవుతుంది. పరీక్ష ఫలితాన్నిబట్టి కౌన్సెలింగ్‌, లేదా చికిత్సతో పరిస్థితిని చక్కదిద్దవచ్చు. ఫలితం వచ్చిన తర్వాత మీ తమ్ముడితో పాటు అమ్మాయి లేదా ఆమె తరఫు దగ్గరి సంబంధీకులను వైద్యుల దగ్గరకు పంపించండి. వైద్యులు మీ మరదలు, లేదా ఆమె బంధువులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, దంపతులు కలిసి కాపురం చేసేలా ప్రోత్సహిస్తారు. అయితే కొందరు పురుషుల్లో ఎటువంటి శారీరక లోపం లేకపోయినా, సేమ్‌ సెక్స్‌ పట్ల ఆకర్షితులయ్యే గుణం కలిగి ఉండడం మూలంగా మహిళలకు శారీరకంగా దగ్గర కాలేరు. ఇలాంటివారికి దీర్ఘకాలం పాటు కౌన్సెలింగ్‌ అవసరం అవుతుంది.
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)