నా సమస్యకు చికిత్స ఉందా?

11-03-2019: డాక్టర్‌! నాదొక చిత్రమైన సమస్య. సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారీ స్ఖలనం జరగక ఇబ్బంది పడుతున్నాను. అంత సమయంపాటు పాల్గొంటూ ఉండడంతో మా ఆవిడ విసుక్కుంటోంది. ఈ సమస్యకు చికిత్స ఉందా?

-ఓ సోదరుడు, ఒంగోలు.
 
శీఘ్రస్ఖలనంలాగే మీది కూడా ఒక సమస్యే. దీన్ని ‘డిలేడ్‌ ఎజాక్యులేషన్‌’ అంటారు. అంతా సజావుగానే ఉన్నా, అంగప్రవేశం తర్వాత ఎంతకీ క్లైమాక్స్‌కు చేరుకోలేక వీర్యస్ఖలనం జరగదు. దాంతో ఎంత సమయం గడిచినా అసంతృప్తితో సెక్స్‌ విరమించవలసి వస్తూ ఉంటుంది. మహిళలకు ఈ ధోరణి చిరాకు తెప్పించడమూ సహజమే! అయితే ఈ సమస్యకు కారణాలున్నాయి. కొందరికి హస్తప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కలిగే ఒరిపిడి, లైంగిక క్రీడలో పొందలేకపోవచ్చు. భార్య మీద ఆసక్తి లోపించినా, పెళ్లికి ముందు ఊహించిన దానికి విరుద్ధమైన భాగస్వామి దొరికినా ఈ పరిస్థితి రావచ్చు. పోర్న్‌ ఎక్కువగా చూసే కొందరు పురుషులు ఆ వీడియోల్లో మహిళల్లా తమ భార్యలూ ప్రవర్తించాలని కోరుకుంటూ ఉంటారు. అలా జరగనప్పుడు కూడా ఎంతసేపటికీ స్ఖలనం జరగదు.
 
మరికొందరికి అంగం పూర్వచర్మం పూర్తిగా వెనక్కి రాదు. ఫైమోసిస్‌ సమస్య లేకపోయినా, అంగం ముందు భాగాన్ని కప్పి ఉంచే ఈ చర్మం వల్ల నొప్పి కూడా ఉండదు. కాకపోతే నాడులు ఎక్కువగా ఉండే ఆ ప్రదేశానికి ఒరిపిడి అందక క్లైమాక్స్‌కు చేరుకోలేకపోతూ ఉంటారు. అలాగే ప్రోస్టేట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా డిలేయ్‌డ్‌ ఎజాక్యులేషన్‌ సమస్య ఉండే వీలుంది. అలాగే యోని మరీ జారుడుగా ఉన్నా, వదులుగా ఉన్నా తగినంత ఫ్రిక్షన్‌ లేక, స్ఖలనం జరగదు. ఇన్ని కారణాలలో దేని వల్ల మీకు సమస్య తలెత్తుతుందో తెలియాలంటే వైద్యులను సంప్రతించక తప్పదు. మీది సరిదిద్దగలిగే సమస్యే. కాబట్టి భయపడకండి.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)