తనకు ద్రోహం చేస్తున్నానా?

ఆంధ్రజ్యోతి (10-12-2019): 

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 25. 14 ఏళ్ల వయసులో, హాస్టల్‌లో ఉన్న సమయంలో స్నేహితుడితో సన్నిహితంగా గడిపాను. ఆ తర్వాత ఎప్పుడూ అలా జరగలేదు. ప్రస్తుతం నేనొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. కానీ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి ద్రోహం చేస్తున్నానా అనే భయం నన్ను వెంటాడుతోంది. నేను స్వలింగ సంపర్కుడినా, కానా అనే విషయాన్ని నిర్ధారించుకోలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటారు?
- ఓ సోదరుడు, అనంతగిరి
 
డాక్టర్ సమాధానం: 13, 14 ఏళ్ల వయసు అబ్బాయిల్లో ఇలాంటివి ఎంతో సహజం. పిల్లలు తమ చేతులతో జననాంగాలు పట్టుకుని ఆడుతూ ఉండడం చూస్తూ ఉంటాం. ఆనందం కోసమే వారు అలా చేస్తారు. మీరు చేసిన పని కూడా అలాంటిదే! ఆ ఒక్కసారే మీరు అబ్బాయితో సన్నిహితంగా మెలిగారు. అంతకు మించి మీ మధ్య ఏమీ జరగలేదు. ఒకవేళ మీరు స్వలింగ సంపర్కులు అయితే ఆ తర్వాత నుంచి అబ్బాయిలకే ఆకర్షితులు అయ్యేవారు. అమ్మాయిల మీద ఆసక్తి కలగదు. కానీ మీ విషయంలో అలా జరగలేదు. అమ్మాయిని ఇష్టపడడమే కాకుండా, పెళ్లికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి మీరు స్వలింగ సంపర్కులు కారని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి అర్థం లేని భయాలు, అనుమానాలు వదలి, హాయుగా పెళ్లి చేసుకోండి. ఆమెకు ద్రోహం చేస్తున్నానేమో అనే ఆత్మన్యూనత భావన నుంచి బయటపడండి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)