14-10-2019: డాక్టర్! నాకు వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంది. ఆయనకు మధుమేహం ఉంది. అయితే మేము శారీరకంగా కలిసిన ప్రతిసారీ ఆయన శిశ్నం పగిలి ఇన్ఫెక్షన్ తలెత్తుతోంది. మందులు వాడినప్పుడు తగ్గి తిరిగి కలిసిన ప్రతిసారీ ఇదే సమస్య తిరగబెడుతోంది. దీనికి నా వైట్ డిశ్చార్జ్ కారణమా? లేదా ఆయనకు ఉన్న మధుమేహమా? ఇక ఎప్పటికీ మేమిలాగే ఇబ్బంది పడుతూ ఉండవలసిందేనా?
ఓ సోదరి, ఖమ్మం
మీవారికి ఉన్న సమస్య ‘బెలనో పాస్థైటిస్’. ఈ సమస్య ఉన్నవారికి శారీరకంగా కలిసిన ప్రతిసారీ శిశ్నం మీద పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇందుకు మధుమేహం కూడా ఓ కారణమే! అయితే మధుమేహం మందులతో అదుపులో ఉంచుకున్నా, సున్తీ చేయించుకోని వారిలో ఈ ఇబ్బంది ఎక్కువ. మీకున్న వైట్ డిశ్చార్జ్ కారణంగా ఆయన శిశ్నం ముందు ఉండే చర్మం దగ్గరి ప్రదేశం పదే పదే ఇన్ఫెక్షన్కు గురవుతూ ఉంటుంది. మందులు వాడినప్పుడు తగ్గుతూ తిరగబెడుతూ ఉండడానికి కారణం ఆ ప్రదేశమే! దీన్ని సున్తీ ద్వారా తొలగిస్తే మీకు వైట్ డిశ్చార్జ్ ఉన్నా, ఈ సమస్య తలెత్తదు. శాశ్వత పరిష్కారం సున్తీ కాబట్టి మీ వారిని ఆండ్రాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లి సున్తీ చేయించండి. ఈ సర్జరీ ఎంతో తేలికైనది. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మీరు కూడా గైనకాలజి్‌స్టను కలిసి వైట్ డిశ్చార్జ్‌కు చికిత్స చేసుకోండి.
డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్
8332850090
(కన్సల్టేషన్ కోసం)