ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా?

 ప్రశ్న: డాక్టర్‌! మాకు పెళ్లై ఇప్పటికి ఆరేళ్లు. గత రెండేళ్లుగా మా వారు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్టు కనిపించినా, ఆపిన వెంటనే తిరిగి తలెత్తుతోంది. ఈ సమస్య మానసికమైనదా, లేక శారీరకమైనదా? అసలు ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందే మార్గం లేదా?

- ఓ సోదరి, చిట్యాల.
 

డాక్టర్ జవాబు: మందులు వాడినప్పుడు సమస్య ఉండడం లేదు అంటున్నారు. పైగా పెళ్లైన నాలుగేళ్ల వరకూ ఈ సమస్య ఎదురు కాలేదని అంటున్నారు. కాబట్టి మీ వారి సమస్యకు కారణం మానసికమైనది అయి ఉండకపోవచ్చు. అదే కారణమైతే ప్రారంభంలోనే ఇబ్బందులు బయటపడేవి. సాధారణంగా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తడానికి హోరోన్ల లోపం లేదా ప్రోస్టేట్‌ గ్రంథిలో ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణాలుగా ఉంటాయి. వీటిని కనిపెట్టాలంటే పరీక్షలు చేయక తప్పదు. పరీక్షలు చేసి, కారణాన్ని నిర్ధారించి, చికిత్సతో సమస్యను శాశ్వతంగా సరిదిద్దే వీలుంది. కాబట్టి మీరు మానసికంగా కుంగిపోవలసిన అవసరం లేదు. ఆయనను వైద్యులకు చూపించి, అవసరమైన పరీక్షలు చేయించండి. అప్పుడు సమస్య నుంచి మీ వారికి శాశ్వత విముక్తి దక్కుతుంది. మునుపటిలా దాంపత్య జీవితంలో చురుగ్గా పాల్గొనగలుగుతారు.

-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,

ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌.

 

8332850090 (కన్సల్టేషన్‌ కోసం)