సైనసైటిస్‌కు సులువైన పరిష్కారం

ఆంధ్రజ్యోతి:నిరంతరం జలుబుతో, ముఖమంతా వాచిపోయి, తలంతా బరువుగా ఉండి జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్‌. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు హోమియోలో అద్భుతమైన వైద్యం ఉందంటున్నారు డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి.
వైరల్‌, బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా సైన్‌సలలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్‌ అంటారు. ముక్కు, కళ్ల చుట్టూ నాలుగు గదులుంటాయి. వాటిని సైన్‌సలంటారు. శ్వాస పీల్చినపుడు గాలి ముక్కు నుంచి సైన్‌సలలోకి వెళుతుంది. పీల్చే గాలిని సమశీతోష్ణ స్థితికి తీసుకువచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి. సైన్‌సల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటకు వెళతాయి. 

కారణాలు 

సైనస్‌ ముఖద్వారం మూసుకుపోతుంది లేదా అక్కడ చాలా మ్యూకస్‌ పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బాక్టీరియా, ఇతర క్రిములు సులభంగా పెరిగి సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్‌ రావటం వల్ల సైన్‌సలకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్‌ సమస్య మొదలవుతుంది. కొందరిలో సైన్‌సలలో వాపు రావటంతో పాటు, బాగా నొప్పిగా ఉంటుంది. చాలాకాలం పాటు ఈ సమస్యకు పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. దీన్ని క్రానిక్‌ సైనసైటిస్‌ అంటారు.
వ్యాధి లక్షణాలు
తలనొప్పి, తలంతా బరువుగా ఉండుట, ముఖంలో వాపు, సైనస్‌ భాగంలోనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలుంటాయి. తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినపుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తల అంతా బరువుగా ఉంటుంది. ఆ పైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది. తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస దుర్గంధంతో కూడి ఉండటం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో ముక్కు వెనకభాగం నుంచి మ్యూకస్‌ గొంతులోకి వెళుతుంది. ముఖంలో వాపు కనిపిస్తుంది. పళ్లు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కనిపిస్తుంది. కొద్దిరోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగా, నోరంతా చేదుగా మారుతుంది. కొందరిలో చెవి వినిపించకుండా పోతుంది. అలసటతోపాటు జ్వరం వస్తుంది. ఈ లక్షణాలు ఉన్నట్లయితే సైనసైటి్‌సతో బాధపడుతున్నట్లు భావించాలి.
 
వ్యాధి నిర్ధారణ
కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. ఫైబర్‌ ఆప్టిక్‌స్కోప్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువుగా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో సీటీ స్కానింగ్‌ చేయాల్సి వస్తుంది. ఎంఆర్‌ఐ చేయించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇతర రక్తపరీక్షలు కూడా అవసరమవుతాయి.
 
హోమియో చికిత్స
హోమియోపతి చికిత్స వల్ల సర్జరీ అవసరం లేకుండానే సైనసైటి్‌సను సమూలంగా తగ్గించుకోవచ్చు. హోమియో మందులతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కానీ హోమియో చికిత్సతో సైనసైటిస్‌ సమస్య సమూలంగా తొలగిపోతుంది. మళ్లీ మళ్లీ బాధించడం జరగదు. సైనస్‌ లక్షణాలను ప్రారంభదశలోనే గుర్తించి అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే సమస్య ఇట్టే తగ్గిపోతుంది. 

డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి., హోమియో
స్టార్‌ హోమియోపతి 
సికింద్రాబాద్‌, ఫోన్‌ : 8977336677