దగ్గినా తుమ్మినా మూత్రం పడిపోతుంటే

ఆంధ్రజ్యోతి,11-09-13:బిగ్గరగా నవ్వాలన్నా భయమేస్తుంటే, తుమ్మితే ఎక్కడ అభాసుపాలవుతామోనని నలుగురిలో తిరగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక ఇంటికే పరిమితమైపోతే... అ బాధ చెప్పనలవి కాదు. యూరిన్‌ ఇన్‌కాంటినెన్స్‌(తెలియకుండా మూత్రం పడిపోవడం) సమస్యతో బాధపడే వారిలో కనిపించే వేదన ఇది. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఎక్కువగా కనిపించే ఈ సమస్యకు వైద్యం లేదని చాలా మంది భావిస్తుంటారు. కానీ హోమియోలో అద్భుతమైన మందులున్నాయని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి.

 
యూరిన్‌ ఇన్‌కాంటినెన్స్‌ అంటే మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం. ఈ సమస్య స్ర్తీలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే చాలా మంది స్త్రీలు ఈ సమస్యతో వైద్యుల దగ్గరకు వెళ్లడానికి సంకోచిస్తుంటారు. ఆత్మన్యూనతా భావంతో తమ బాధను తమలోనే దాచుకుంటారు. సమస్య తీవ్రమై దైనందిన, సాంఘిక జీవనానికి ఆటంకం కలిగినప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు. 

ముఖ్యమైన రకాలు

ఒత్తిడి కారణంగాః దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు మూత్రం పడిపోతుంది. దీన్ని స్ట్రెస్‌ ఇన్‌కాంటినెన్స్‌ అంటారు. ఇది ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. మూత్రాశయ కండరాలు బలహీనపడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. 

అత్యవసర పరిస్థితిః అత్యవసరంగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని అర్జ్‌ ఇన్‌కాంటినెన్స్‌ అంటారు. బ్లాడర్‌ ఓవర్‌ యాక్టివ్‌నెస్‌ వల్ల ఈ సమస్య ప్రారంభమవుతుంది. వయసు పైబడిన వారిలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం గమనిస్తుంటాం. అర్జ్‌ ఇన్‌కాంటినెన్స్‌తో బాధపడే వారు త్వర త్వరగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి రావడం, వెళ్లే లోపలే మూత్రం పడిపోవడం జరుగుతుంది. ఈ సమస్య ఏ వయసు వారిలోనైనా రావచ్చు. మామూలుగా వచ్చే యూరినరీ బ్లాడర్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడ అర్జ్‌ కాంటినెన్స్‌ రావచ్చు. కానీ వీరిలో ఇన్‌ఫెక్షన్‌ తగ్గగానే ఈ సమస్య కూడా తగ్గిపోతుంది. కొందరిలో మూత్రాశయ కండరాలు అవసరం లేకుండానే సంకోచించడం వల్ల మూత్రం మాటిమాటికి రావడం, వెంటనే వెళ్లవలసి రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ అర్జ్‌ ఇన్‌కాంటినెన్స్‌ అనేది న్యూరోజెనిక్‌ బ్లాడర్‌ అంటే మూత్రాశయానికి సంబంధించిన నాడులు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రావచ్చు. న్యూరోజెనిక్‌ బ్లాడర్‌ సమస్య డయాబెటిస్‌ వల్ల లేదా మల్టిపుల్‌ స్ల్కిరోసిస్‌ లేదా వెన్నుపూస దెబ్బతినడం వల్ల రావచ్చు. 

ఓవర్‌ ఫ్లో ఇన్‌కాంటినెన్స్‌ః తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. పెల్విక్‌ ఫ్లోర్‌ కండరాలు బలహీనపడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. డయాబెటిక్‌ న్యూరోపతి, మల్టిపుల్‌ స్ల్కెరోసిస్‌ ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. 
ఫంక్షనల్‌ ఇన్‌కాంటినెన్స్‌ః పార్కిన్‌సన్స్‌ లాంటి వ్యాధులతో బాధపడే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. కంటి చూపు సరిగ్గా లేని వారు, ఆందోళనకు గురయ్యే వారిలోనూ ఉంటుంది.

కారణాలు

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. వయసు పైబడిన వారిలోనూ, డయాబెటిస్‌తో బాధపడే వారిలోనూ ఎక్కువే. ప్రొస్టైటిస్‌ కూడా కారణమే. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువ. కొన్ని రకాల మందులు, సెడేటివ్స్‌ తీసుకోవడం కారణమవుతుంది. స్థూలకాయం, మలబద్ధకం కూడా యూరిన్‌ ఇన్‌కాంటినెన్స్‌కు కారణమవుతాయి. 

ప్రధాన సమస్యలు 

పొగతాగడం, స్థూలకాయం, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. 

నిర్ధారణ

ఫిజికల్‌ ఎగ్జామినేషన్‌, స్ట్రెస్‌ టెస్ట్‌, యూరిన్‌ ఎనాలసిస్‌, సిస్టోస్కోప్‌, పెల్విక్‌ అల్ర్టాసౌండ్‌ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. 

హోమియో చికిత్స

లక్షణాల ఆధారంగా కాన్‌స్టిట్యూషనల్‌ హోమియో మందులను ఇవ్వడం ద్వారా యూరిన్‌ ఇన్‌కాంటినెన్స్‌ను శాశ్వాతంగా పారదోలవచ్చు. చికిత్సకు ముందు శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. హోమియో మందుల ద్వారా వ్యాధి కారణాలు సమూలంగా తొలగిపోతాయి. అంతేకాకుండా, ఈ మందుల వల్ల ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు. చికిత్సలో కాస్టికమ్‌, సెపియా, కాంథారిస్‌, క్రెసోట్‌, పల్సటిల్లా వంటి మందులు బాగా ఉపయోగపడతాయి. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో పూర్తికాలం చికిత్స తీసుకుంటే సమస్య సులభంగా తగ్గిపోతుంది.
 
డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి
హోమియో వైద్యనిపుణులు,
జెనెటిక్‌ హోమియోపతి
దిల్‌సుఖ్‌నగర్‌ - కొండాపూర్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 8125 108 108
 8019 108 108