సెప్సిస్‌ను ఆదిలోనే గుర్తించే రక్తపరీక్ష

ఆంధ్రజ్యోతి,2-6-15:శరీరంలో అంతర్గత వాపునకు కారణమయ్యే సెప్సిస్‌ బాధితులను తొలిదశలోనే గుర్తించే పదకొండు రకాల జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువులను పసిగట్టే కొత్త రక్తపరీక్షను అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. శరీరంలో వ్యాధికారక క్రిముల ఉనికిని గమనించి రోగనిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల సెప్సిస్‌ ఏర్పడుతుందని అన్నారు. బ్యాక్టీరియాతో పాటూ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా దీనికి కారణమే అయినా యాంటీబయాటిక్స్‌కు ఇది లొంగదని, కొన్ని సందర్భాల్లో రోగి ప్రాణాలు తీస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సెప్సి్‌సను ముందే గుర్తించడం వల్ల బాధితులను ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన పర్వేశ్‌ కార్తి తెలిపారు.