సైనసైటిస్‌కు శాశ్వత పరిష్కారం

ఆంధ్రజ్యోతి,12-08-13:వాతావరణంలో మార్పులతోపాటు వర్షాకాలం, శీతాకాలాల్లో సైనసైటిస్‌ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం.. సైనసైటిస్‌ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా, ఆపరేషన్‌ చేయించినా తాత్కాలిక  ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. ఆపరేషన్‌ అవసరం లేకుండానే సైనసైటిస్‌కు హోమియోలో అద్భుతమైన మందులు ఉన్నాయంటున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి.

వాతావరణ మార్పులు జరిగిన ప్రతిసారీ సైనసైటిస్‌ బారినపడే వారిని చూస్తుంటాం. సైనసైటిస్‌కు ప్రధానకారణం వైరస్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు. ముఖ్యంగా స్ట్రెప్టోకాకస్‌ న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా వల్ల వస్తుంది. ముఖంలో కళ్ల దగ్గర, ముక్కు పక్కభాగంలో ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్‌ అంటారు. ఈ భాగం ఇన్‌ఫెక్షన్లతో వాచిపోవడాన్ని సైనసైటిస్‌ అంటారు. సైనసైటిస్‌లో అక్యూట్‌ అంటే ఒక వారం రోజులుంటుంది. సబ్‌అక్యూట్‌ అంటే 4నుంచి 8 వారాలుంటుంది. క్రానిక్‌ అంటే దీర్ఘకాలిక సైనసైటిస్‌. ఇది 8 నుంచి 10 వారాలుపైగా ఉంటుంది.  

సైనస్‌ రకాలు: ఫ్రాంటల్‌, పారానాసల్‌, ఎత్మాయి డల్‌, మాగ్జిలరీ, స్పినాయిడల్‌. ఇవి కుడి, ఎడమగా రెండు జతలుంటాయి. 

కారణాలు: ఇన్ఫెక్షన్‌ బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, ఉపరితల శ్వాసకోస వ్యాధులు, ముక్కులో దుర్వాసన, అలర్జీ, పొగ, విషవాయువుల కాలుష్యం, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, వర్షాకాలం, చలికాలం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయం, కొడైకెనాల్‌, ఊటీ, జమ్మూకాశ్మీర్‌, కులూమనాలీ, ముస్సోరి లాంటి మంచు ప్రదేశాలు, నీటిలో ఈదటం, జలుబు, గొంతునొప్పి, పిప్పిపన్ను, టాన్సిల్స్‌ వాపు, రోగనిరోధక శక్తి త గ్గటం లాంటి కారణాల వల్ల సైనసైటిస్‌ వస్తుంది. సైనస్‌ ముఖద్వారం మూసుకు పోతుంది 

వ్యాధి లక్షణాలు: తలనొప్పి, తలంతా బరువుగా ఉండుట, ముఖంలో వాపు, సైనస్‌ భాగంలోనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు దురద, నీరు కారడం, గొంతులోకి ద్రవాలు కారడం, దగ్గు, జలుబు, చెవిలో చీము వంటి లక్షణాలుంటాయి. తరచు జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్‌ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినపుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. 

వ్యాధి నిర్ధారణ: కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. ఎక్స్‌రే, కొన్ని సందర్భాల్లో సి.టి స్కానింగ్‌ చేయాల్సి వస్తుంది. ఇతర వ్యాధులతో కలిసి సైనసైటిస్‌ రావచ్చు. సైనస్‌ భాగంలో నొక్కితే నొప్పి వస్తుంది. 

దుష్పరిణామాలు: దీర్ఘకాలికంగా సైనసైటిస్‌ వ్యాధితో బాధపడే వారు కళ్లరెప్పల వాపు, కనుగుడ్లు పక్కకు జరిగినట్లుండటం, కళ్ల నరాలు దెబ్బతిన్నపుడు చూపు కోల్పోవటం, వాసన తెలియక పోవ డం, తరచూ జ్వరం రావటం, ఎదుగుదల లోపాలు, మానసికంగా ధైర్యం కోల్పోవటం జరుగుతుంది. కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. హోమియోపతి ద్వారా శస్త్రచికిత్స, సైడ్‌ఎఫెక్టులు లేకుండా కానిస్టూషనల్‌ చికిత్స ద్వారా స్వస్థత కలిగించవచ్చు. 

సైనసైటిస్‌ను గుర్తించే ప్రశ్నావళి

మీరు పదిరోజుల కంటే ఎక్కువగా ఈ కింది వాటిలో దేనితోనైన బాధపడుతున్నారా? అయితే సైనసైటిస్‌ ఉన్నట్లే! వెంటనే హోమియో డాక్టరును సంప్రందించండి.
ముఖభాగంలో నొప్పి              అవును/ కాదు
తలనొప్పి                            అవును / కాదు
ముక్కు దిబ్బడ                   అవును / కాదు
పసుపు,ఆకుపచ్చని ముక్కుస్రావాలు అవును/ కాదు
జ్వరం                             అవును / కాదు
నోటి దుర్వాసన                    అవును / కాదు
పంటినొప్పి                        అవును / కాదు 
సైనసైటిస్‌ ఎలా నివారించాలి? 
నోటిని తరచుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం, చెవిలో దూదిపెట్టుకోవడం సైనసైటిస్‌ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. 
 
హోమియో చికిత్స
హోమియోపతి చికిత్స వల్ల ఆపరేషన్‌ అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించుకోవచ్చు. కాలిబైక్‌, కాలిసల్ఫ్‌, హెపర్‌సల్ఫ్‌, మెర్క్‌సాల్‌, సాంగ్‌న్యురియా, రెయ్‌నా, మైనర్‌, స్పైజిలియా వంటి మందులు ఉన్నాయి. హోమియో మందులు వాడిన చాలా మందికి సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ తొలగిపోతుంది. హోమియో చికిత్స వల్ల సైనసైటిస్‌ సమూలంగా తొలగిపోతుంది.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి
ఎండి(హోమియో), స్టార్‌ హోమియోపతి
సికింద్రాబాద్‌, కూకట్‌పలి,దిల్‌సుఖ్‌నగర్‌, విజయవాడ, వైజాగ్‌, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక 
ఫోన్‌ : 90300 81876, 90300 81861