డియోడరెంట్‌ అరుదుగానే!

27-08-2019: చెమట వాసన వదిలించే డియోడరెంట్లను తరచుగా వాడుతున్నారా? అయితే పలు రకాల అనారోగ్యాలను తెచ్చిపెట్టే ఆ డియోడరెంట్లను ఎంత తక్కువగా వాడితే అంత మేలు! వాటిలోని రసాయనాలు, అవి కలిగించే ఆరోగ్య నష్టాలు ఇవీ!!
 
అల్యూమినియం: మహిళల్లో రొమ్ము కేన్సర్‌, పురుషుల్లో ప్రోస్టేట్‌ కేన్సర్‌లతో పాటు వృద్ధాప్యంలో అల్జీమర్స్‌ను కలిగించే గుణం ఈ లోహానికి ఉంది.
 
పారాబెన్స్‌: హార్మోన్‌ వ్యవస్థను అస్తవ్యస్థం చేసి, పిల్లల్లో ముందుగానే కౌమార లక్షణాలు, హార్మోన్‌ సంబంధిత కేన్సర్‌లను కలిగిస్తుంది. పుట్టుకతో అవయవ లోపాలను కలిగించే గుణం కూడా ఈ రసాయనానికి ఉంటుంది.
 
ప్రొపైలీన్‌ గ్లైకాల్‌: కేంద్ర నాడీ వ్యవస్థ, కాలేయం, గుండెకు ఈ మూలకం చేటు చేస్తుంది.
 
పాథలేట్స్‌: పుట్టుకతో సంక్రమించే అవయవ లోపాలు, కణ విచ్ఛిత్తులకు పాథలేట్స్‌ దారి తీస్తాయి.
 
ట్రైక్లోసాన్‌: పురుగుమందుగా ఎఫ్‌డిఎ పేర్కొన్న ఈ రసాయనం విషంతో సమానం.