పక్షవాతం మటుమాయం

ఆంధ్రజ్యోతి,13-08-13:పక్షవాతంతో కాలూ, చేయీ ఆడని పరిస్థితిలో ఉన్న ఓ మహిళ నానా అవస్థలు పడ్డారు. మంచానికే పరిమితమైన ఆ మహిళా రోగికి ఆయుర్వేద వైద్యంతో పూర్తిగా నయం చేసిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టరు బుక్కా మహేశ్‌ బాబు చెబుతున్న కేస్‌ స్టడీ వివరాలు.

అత్తగారికి బ్రెయిన్‌ సర్జరీ అయి పక్షవాతం వచ్చింది. పాపం! కొత్త కోడలు బాగా సపర్యలు చేశారు. పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడం, వంటావార్పూ, భర్త బాగోగులు చూసుకోవడం తదితర ఒత్తిళ్లు ఒక్కసారిగా మీద పడటంతో ఆవిడకు నడుం నొప్పి వచ్చేసింది. తట్టుకోలేకపోయింది. న్యూరోసర్జన్‌ దగ్గరకు తీసుకువెళితే ఆపరేషన్‌ తప్పదన్నారు. 

 ఒక ప్రసిద్ధ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడా డాక్టర్లు ఆపరేషన్‌ తప్పదన్నారు. ఆవిడ ఊగిసలాట ధోరణి చూసి మీరు ఇలాగే ఉంటే మల, మూత్రాలపై అదుపు పోయి, కాళ్లూ చేతులూ పడిపోతాయన్నారు. ఆమెకు న్యూరో సర్జన్‌ల మాటలతో ఒక్కసారి నెత్తిన పిడుగు పడినట్లయింది. చివరికి కొందరి సలహాతో ఆమె మా దగ్గరికి వచ్చారు. ఆమె పేరు హిమబిందు (26). ఆమె బాగా చదువుకున్నారు. ఆమెది నాలుగడుగులు కూడా నడవలేని పరిస్థితి. కాళ్లలో తిమ్మిర్లు. రెండు కాళ్లల్లో విపరీతమైన నొప్పి. 

వ్యాధి కారణాలు
నా మొదటి డెలివరీలో నడుముకు ఇంజక్షన్‌ ఇచ్చారు. అప్పటి నుంచి నెమ్మదిగా నడుం నొప్పి ప్రారంభం అయింది. ఏదో చిన్న సమస్య కదాని పెయిన్‌ కిల్లర్‌ వేసుకొనేదాన్ని. ఒక అయిదు నెలలు అవిశ్రాంతంగా పనిచేయడంతో జీవితం ఈ విషాద పరిస్థితికి లోనైందన్నారు. 
 
వ్యాధి లక్షణాలు
 కూర్చుంటే లేవలేను. లేచి రెండడుగులు వేయాలన్నా కష్టం. కాళ్లు బరువెక్కుతాయి. రెండు పాదాల్లో తిమ్మిర్లతోపాటు మంటలు. వీటితో రోజంతా మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. 
 రెండు కాళ్లల్లో కరెంట్‌ షాకులు పెట్టినట్లుగా పిరుదల వెనుక నుంచి పాదాల వరకు మంట, నొప్పులు. రాత్రివేళల్లో పడుకున్నా పిక్కలు గట్టిగా పట్టేస్తాయి. నడుస్తుంటే  కళ్లు తిరుగుతాయి. 
  జడ వేసుకోవాలన్నా, చీర మార్చుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, టాయిలెట్‌కు నొప్పే. కాలివేళ్ల చివర్లతో సూదులతో పొడిచినట్లుగా అనిపిస్తుంది. భవిష్యత్తంటే భయమేసిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా, సరిగా కూర్చోలేక, నడవలేక కుంగిపోయినట్లు అనిపించేది. 
 

 ఆమె చెప్పినవన్నీ జాగ్రత్తగా విని, పరిశీలించుకున్న తర్వాత ఆమె సమస్యను ‘అభిఘాతజ కటివాతం’గా నిర్ధారించడం జరిగింది. దీన్ని ఆధునిక వైద్యంలో యాన్యులార్‌టేర్‌ లేదా యాన్యూలార్‌ డిస్క్‌బల్జ్‌, డీజనరేటెడ్‌ డిస్క్‌, స్పాండిలోలిస్టసిస్‌గా చెప్పుకోవచ్చు. తీవ్ర పని ఒత్తిడి, అకస్మాత్తుగా శరీరంలో జర్క్‌లివ్వడం, వేగంగా వెళ్లే వాహనాల మీద నుంచి కింద పడటం, డీజనరేషన్‌ జరగడం, పోషకాహార లోపం, ఇతరత్రా కారణాల వల్ల ఇటీవల చిన్న వయసు వారికి కూడా అతి తీవ్రమైన రకరకాల నడుం నొప్పులు వస్తున్నాయి. ఆమె ఎం.ఆర్‌.ఐ రిపోర్టులు పరిశీలిస్తే ఎల్‌ 4 వర్టిబ్రా, ఎల్‌ 5 వర్టిబ్రా మధ్య ఉన్న డిస్క్‌ చితికి వెన్నుపాము వెళ్లే దారి ఇరుకైంది. దీనివల్ల సియాటిక్‌ నర్వ్‌పై ఒత్తిడి పెరగడంతో వెన్ను నొప్పి మొదలైంది. ఇక పిరుదుల వెనకాల నుంచి వెళ్లే నరంపై ఒత్తిడి పడటంతో నొప్పి తీవ్రమైంది. ఈ ప్రత్యేక పరిస్థితిని కెనాల్‌ స్టెనోసిస్‌ అని కూడా అంటారు. దీనికితోడు ఎల్‌ 4, ఎల్‌ 5 మధ్య ఉన్న డిస్క్‌ చుట్టూ రక్షణ వలయంగా ఉన్న యాన్యులస్‌ అనబడే మెత్తని రక్షణ కవచం కూడా చితికిపోయింది. దీన్ని యాన్యులార్‌టేర్‌ అంటారు. 

చికిత్సా పద్ధతి 

ఆధునిక టెక్నాలజీ రావడంతో వ్యాధి నిర్ధారణ మార్గాలు సులువయ్యాయి. పెయిన్‌ కిల్లర్స్‌ కేవలం ఆ గంట వరకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. చికిత్స చాలా సంక్లిష్టమైంది. ఆయుర్వేదానికొచ్చేసరికి సర్జరీ అంటేనే చివరి ప్రయత్నంగా వస్తున్నారు. ముందే వస్తే చికిత్స సులువవుతుంది. ఆపరేషన్‌ దాకా వెళ్లి తిరిగి వచ్చి చికిత్స చేసుకున్న తర్వాత అందరిలాగా సాధారణ జీవితం గడుపుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు. పథ్యం, అపథ్యం విషయంలో సరికొత్త శాస్త్రీయ పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో చికిత్స మరింత తేలికైంది. ఇక్కడ కఠిన పథ్యాలు, వేడి చేయడాలు, కషాయాలు, చేదు మాత్రలు గట్రా ఏమీ ఉండవు. ఔషధాలు ప్రత్యేకమైన సూక్ష్మ నానోపార్టికల్స్‌గా ఉంటూ తొందరగా పనిచేస్తాయి. ఇలా ఆమె చికిత్స నాలుగు నెలలపాటు కొనసాగింది. పద్ధతులన్నీ వివరించడం జరిగింది. నూనె మర్దనలు, పంచకర్మల అవసరమే పడలేదు. 

చికిత్సా ఫలితాలు 
నాలుగు వారాల తర్వాత రివ్యూకు వచ్చినప్పుడు ఆమె నొప్పి చాలా వరకు తగ్గిందన్నారు. రెండు నెలలు వాడిన ప్రత్యామ్నాయ వైద్య మార్గాల కన్నా మా మందులు బాగా పని చేశాయని కూడా ఆమె అన్నారు. 8 వారాల తర్వాత రివ్యూకు వచ్చినప్పుడు సూదులతో పొడిచినట్లుగా ఉండటం, మంటలలు, తిమ్మిరులు, కాళ్లలో నరాలు లాగడం బాగా తగ్గిందన్నారు. కొంత మేరకు ఒంగడం కూడా సులువైంది. పైగా చిన్న చిన్న పనులు కూడా చేసుకోగలుగుతున్నారు. 12 వారాల తర్వాత రివ్యూకు వచ్చినప్పుడు మూడంతస్థులు ఎక్కినా నొప్పి లేదన్నారు. శుభకార్యాలకు వెళ్లినా ఇబ్బంది లేదు. ఇటీవల మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించినా నొప్పి అన్నదే లేదు. తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నారిప్పుడు. ఆరోగ్యం బాగు పడినందుకు ఆమె మాకు అనేక పర్యాయాలు కృతజ్ఞతలు తెలిపారు.
 
డాక్టర్‌ బుక్కా మహేశ్‌బాబు
గురు ఆయుకేర్‌ మల్టీ స్పెషాలిటీ
ఆయుర్వేద హాస్పిటల్‌
చందనా బ్రదర్స్‌ ఎదురుగా, 
చిక్కడపల్లి, హైదరాబాద్‌, మధురవాడ, విశాఖపట్టణం
ఫోన్‌: 9885306096,040 27618612