ప్రొస్టేట్‌ గ్రంధి వాపు

ఆంధ్రజ్యోతి,27-6-15:ప్రొస్టేట్‌ గ్రంథి పురుషులకు అత్యంత కీలకమైనది. మూత్రాశయం కిందే ఉసిరికాయ పరిమాణంలో మూత్రం మార్గం చుట్టూ ఆవరించి ఉంటుంది. వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సంతానానికి బీజాంకురాలుగా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు ఈ ప్రొస్టేట్‌ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంది. అందుకే ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. కానీ పురుషులలో వయస్సు పెరుగుతున్న కొద్ది ఇది ఉబ్బి పెద్దగా పెరుగుతుంది. ఫలితంగా మూత్ర విసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తటం చాలా సహజ పరిణామంగా మారింది. దీన్ని బినైన్‌ ప్రొస్టేటిక్‌ హైపర్‌ ప్లేసియా(బిపిహెచ్‌) అని అంటారు. ఇది ఇబ్బంది పెట్టేదే కానీ ప్రమాదం కాదు. అయితే ఇదే ఆ తర్వాత ప్రోస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌గా ఆరంభమవ్వచ్చు. దీన్ని ముందుగా గుర్తించే స్ర్కీనింగ్‌ పరీక్షల గురించి అవగాహన లేకపోవటం వల్ల క్యాన్సర్‌ ప్రోస్టేట్‌ను దాటి ఎముకలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తిస్తే చాలా వరకు దీనిని నియంత్రించడం, నయం చేయటం సులభం. అందుకే పెద్ద వయస్సు వాళ్లలో మూత్ర సమస్యలు వచ్చినపుడు క్యాన్సర్‌ కాదని నిర్ధారించుకోవటం అవసరం.

ఇది వృద్ధుల్లో ఎక్కువ. 40 సంవత్సరాల లోపు చాలా అరుదు. బ్యాటరీ పరిశ్రమల్లో కాడ్మియంకు లోనయ్యే వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇది ఎక్కువ.
 
లక్షణాలు
ప్రోస్టేట్‌ వాపులో తరచూ మూత్రానికి వెళ్లాల్లి రావటం.
మూత్ర విసర్జన కష్టంగా ఉండటం, బొట్టుబొట్టుగా వస్తుండటం.
మూత్రాన్ని ఆపుకోలేక పోవటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ లక్షణాలన్నీ బిపిహెచ్‌ వల్ల వచ్చేవి. అవి అనుకోకుండా క్యాన్సర్‌ ఏమైనా ఉన్నదేమో నిర్ధారించుకోవాలి. పి.ఎన్‌. ఎ ద్వారా నిర్ధారించవచ్చు.
 
గుర్తించేది ఎలా
ప్రతి పురుషుడు కూడా 50 సంవత్సరాల తర్వాత ఏటా పి.ఎన్‌.ఎ. పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా పెరుగుదల ఎక్కువగా, గట్టిగా మారినపుడు డిజిటల్‌ రెక్టల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు. పి.ఎన్‌.ఎ. స్థాయి వయసు పెరుగుతున్న కొద్ది పెరుగుతుంది. 45 ఏళ్ల వయసున్న వారికి పి.ఎన్‌.ఎ. 4 ప్రమాదంగా గుర్తించాలి.
 
డాక్టర్‌ ఎ.యం. రెడ్డి, 
పాజిటివ్‌ హోమియోపతి, 
ఫోన్‌- 92461 99922
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు
డాక్టర్‌తో మాట్లాడాలంటే ఫోన్‌ : 9246166333