ఫ్యాటీ లివర్‌ తగ్గాలంటే...

15-02-2019: నాకు ఫ్యాటీ లివర్‌ ఉన్నట్టుగా పరీక్షల్లో తేలింది. ఫ్యాటీ లివర్‌ తగ్గాలంటే ఏం చేయాలి?
- శిరీష
స్థూలకాయం మూడేళ్ల కన్నా ఎక్కువగా కంటిన్యూ అయితే ఫ్యాటీ లివర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల సదరు వ్యక్తి ప్రొడక్టివిటీ లెవల్స్‌ పడిపోతాయి. ఆల్కహాల్‌ వల్ల కూడా ఫ్యాటీ లివర్‌ వస్తుంది.
 
తీసుకోవాల్సిన జాగ్రత్తలివి...
స్థూలకాయం ఉంటే తగ్గించుకోవాలి.
మూడు పూటలా ఆహారంతో పాటు పండ్లు, కూరగాయల సలాడ్స్‌ తీసుకోవాలి.
ఆహారంతో పాటు ద్రవపదార్థాలు తప్పకుండా తీసుకోవాలి. ఉదాహరణకు మజ్జిగ, రసం, సాంబారు, సూపులాంటివి.
బాదం, చేపలు, అవిసెల్లాంటి గుడ్‌ ఫ్యాట్‌ ఉండేవాటిని ఆహారంగా తీసుకోవాలి.
శరీరానికి తగినంత వ్యాయామం చేయాలి.
ప్రతిరోజూ టైమ్‌కి ఆహారం తీసుకోవాలి.