వృద్ధులకు ఆరోగ్యనియామాలు అవసరం

02-11-13

పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తికి కావలసిన విటమిన్లను, శరీర పోషణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలే కాకుండా శరీరానికి నూతనోత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటివి కూడా ఆహార పదార్థాల జాబితాలోకే వస్తాయి. ఈ విషయంలో వృద్ధులకు మరింత అవగాహన అవసరం అంటున్నారు వైద్యులు..
 
పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు మనకు ప్రకృతి ప్రసాదం. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటేనే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. వయసు పైబడిన తరువాత అనేక కారణాలరీత్యా ఆహార విషయాల్లోనూ కొన్ని నియమాలు పాటించక తప్పదు. వృద్ధులకు విటమిన్‌-డి, కాల్షియం, విటమిన్‌-బి12, పీచు, పొటాషియం వంటి పోషకాల అవసరం ఎక్కువ. అందుకే వాటికి సంబంధించిన అవగాహన ఉంటే ఆ ఆహారాన్ని తీసుకునే               వీలుంటుంది.
క వయసు పైబడినవాళ్లు ఎప్పుడూ తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌-డి, కాల్షియం పొందవచ్చు. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి. 
క చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాంసం నుంచి విటమిన్‌-బి12 అందుతుంది. 
క సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం ఎక్కువగా తీసుకుంటే ఆ బాధ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ఎందుకంటే వీటన్నింటిలోనూ పీచు అధికంగా ఉంటుంది.
క పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలలో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. 
క అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించడం మంచిది. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దు తిరుగుడు నూనె వంటివి మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.