వృద్ధాప్యంలో కండలు ఇక కరగవు

13-03-2018: వయసు పైబడినకొద్దీ కండలు కరిగిపోతుంటాయి. వృద్ధాప్యంలో కాళ్లు, చేతుల్లోని కండరాలు కరిగిపోయి బక్కచిక్కినట్లు కనిపిస్తుంటారు. అయితే అలా ఎందుకు అవుతుందో మాత్రం ఇప్పటివరకు ఎవరూ చెప్పలేకపోయారు. దీనిపై పరిశోధన జరిపిన యూకేలోని మాంచెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వయసుపైబడే కొద్దీ కాళ్లలోని కండరాలను నియంత్రించే 30 నుంచి 50శాతం నాడులు బలహీనపడిపోతాయని గుర్తించారు. దీంతో మెదడు, కండరాల మధ్య సంబంధం తెగిపోవడం వల్ల కండలు కరిగిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ నాడులు బలహీనపడటాన్ని తగ్గిస్తే కండరాలు కరగకుండా జాగ్రత్త పడొచ్చని పేర్కొన్నారు.