2050 నాటికి వృద్ధ భారత్

గణనీయంగా పెరగనున్న వృద్ధుల సంఖ్య
న్యూఢిల్లీ, మే 15: దేశంలో వృద్ధుల సంఖ్య క్రమేణా పెరగనుందా..? యువ భారత వృద్ధ దేశంగా మారనుందా..? అంటే పీఎఫ్‌ఆర్‌డీఏ-సీఆర్‌ఐఎస్‌ఐఎల్‌ నివేదిక అవుననే చెబుతోంది. జనాభా పరివర్తనను బట్టి 2050 నాటికి వృద్ధ భారతగా మారుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ జనాభాలో ప్రతి 12 మందికి ఒకరు 60 ఏళ్లకు పైబడినవారు ఉండగా, 2050 నాటికి ప్రతి ఐదుగురిలో ఒకరు ఉంటారని పేర్కొంది. 2015లో దేశ జనాభాలో 90 శాతం మంది 60 ఏళ్లలోపు వారేనని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 60 ఏళ్లకు పైబడిన వారు 8.9 శాతం ఉండగా, 2050 నాటికి వీరి సంఖ్య 19.4 శాతానికి పెరుగుతుందని పీఎ్‌ఫఆర్‌డీఏ చైర్మన్‌ హేమంత జి. కాంట్రాక్టర్‌ నివేదికలో వెల్లడించారు.