పేగులోని బ్యాక్టీరియాతో వృద్ధాప్యం దూరం!

హౌస్టన్‌, జూన్‌ 17: భవిష్యత్తులో వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేయొచ్చా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. పేగులోని బ్యాక్టీరియాతో తయారుచేసే ఔషధంతో వృద్ధాప్య ప్రక్రియకు చెక్‌ పెట్టవచ్చవని చెబుతున్నారు. అంతేకాదు అల్జీమర్స్‌ వ్యాధిరాకుండా కాపాడుకోవచ్చని వాదిస్తున్నారు. మానవుని పేగులో ఉండే సీ.ఎలగాన్స్‌ అనే క్రిమిపై పరిశోధనలుచేయగా దానిలోని జన్యువులు, సమ్మేళనాలు రోగాలను అడ్డుకుని జీవిత కాలాన్ని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. దీనిసాయంతో కచ్చితంగా వృద్ధాప్యం తొందరగా దరిచేరకుండా చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.