ముసలితనంలో ఆరోగ్యం వర్థిల్లేలా

03-12-2018: వృద్ధాప్యంలో అత్యధికుల్ని అమితంగా వేధించేవి.....అధిక రక్తపోటు, గుండె జబ్బులు, నొప్పులు, వాపులు ఇవేగా! అయినా ఏవో ఒకటి రెండు మాత్రలు వేసుకోవడంతోనే పరిస్థితి చక్కబడితే సంతోషమే గానీ, అలా కాదుగా! రోజూ క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నా, పదేపదే అవి అదుపు త ప్పుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మందులే సమస్తం అనుకోకుండా, ఆహారంలోనే కొన్ని మార్పులు చే సుకోవలసి ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆహారంలో చేపల్ని చేర్చుకోవడం ఒక తెలివైన పని అంటున్నారు పరిశోధకులు.
 
గుండె పనితనాన్ని పరీక్షించేదుకు ఇటీవల పురుషుల్లో సగటున 74, స్త్రీలల్లో 63 ఏళ్లున్న 2600 మందిని తీసుకుని వారు పరిశీలించారు. ఏ వృద్ధుల రక్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాిసిడ్స్‌ అత్యధికంగా ఉన్నాయో వారు ఆరోగ్యపరమైన ఒడిదుడుకులేవీ లేకుండా నిలకడగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. దానికి వాళ్లు చేపల్ని ఎక్కువగా తినడమే కారణమని వారి అధ్యయనాల్లో బయటపడింది. అందువల్ల వృద్ధుల్లో వచ్చే ఈ రక్తపోటు, గుండెజబ్బులు, తరుచూ వచ్చే నొప్పులు, వాపులకు తరచూ చేపలు తినడం ఒక పరిష్కార మార్గంగా వారు చెబుతున్నారు. అయినా, మాత్రలు వేసుకొమ్మంటేనో, సిరప్‌లు తాగమంటేనో ఇబ్బంది గానీ, పెద్ద వయసులో కూడా అతి సులువుగా జీర్ణమయ్యే చేపల్ని తినమంటే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మొదలెడితే సరి!