యంగ్‌ మైండ్‌ మీదే

ఆంధ్రజ్యోతి, 02-11-2015: మెదడు యంగ్‌గా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలిట. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. న్యూరోఇమేజింగ్‌ స్టడీ ద్వారా వ్యాయామం చేయడంవల్ల ఏజింగ్‌ బ్రెయిన్‌ యాక్టివ్‌గా ఉండగలదని తేలింది. జపాన్‌లోని సుబుకా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ హిదయకి సోయా ఆధ్వర్యంలో ఈ స్టడీ జరిగింది.
 
బ్రెయిన్‌ యాక్టివిటీకి, బ్రెయిన్‌ ఫంక్షన్‌కి, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ఉన్న దగ్గర సంబంధాన్ని మొదటిసారి ఈ అధ్యయనంలో కనుగొన్నారు. ఈ స్టడీని కొంతమంది జపాన్‌ సీనియర్‌ సిటిజన్స్‌ మీద చేశారు. శారీరకంగా ఫిట్‌గా ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ ఫిట్‌గా లేని సీనియర్‌ సిటిజన్స్‌ కన్నా మానసికంగా ఎంతో చురుగ్గా ఉన్నారని ఇందులో వెల్లడైంది. ఫిట్‌నెస్‌ బాగా ఉన్న వ్యక్తులు తమ మెదళ్లను యుక్తవయసులో ఉన్నప్పుడు ఉపయోగించనంత చురుగాన్గు, వేగంగాను ఉపయోగిస్తుండడాన్ని కూడా అధ్యయనకారులు గమనించారు.
 
యుక్తవయసులో ఉన్న వారికన్నా వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్‌లోని రకరకాల భాగాలను పెద్దవాళ్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు యంగ్‌గా ఉన్నప్పుడు ఎడమవైపు ఉండే ప్రిఫంటల్‌ కార్టెక్స్‌ (పిఎఫ్‌సి)ను మెంటల్‌ టాస్కులకు ఉపయోగిస్తే, పెద్దయిన కొద్దీ కుడివైపు ఉన్న పిఎఫ్‌సిని ఇదే పనులకు వాడతాం. పిఎఫ్‌సి బ్రెయిన్‌ ముందర భాగంలో అంటే నుదురు వెనుక ఉంటుంది.
 
జ్ఞాపకశక్తి పనిచేసేట్టు చేయడంలో, తెలివితేటలకు సంబంధించి, భాష, దృష్టి విషయాల్లో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. టెంపరరీ స్టోరేజ్‌, మానిప్యులేషన్‌ ఆఫ్‌ మెమరీస్‌, ఇన్‌హిబిటరీ కంట్రోల్‌ విషయాల్లో యువత కుడివైపునున్న పిఎఫ్‌సిని ఉపయోగిస్తే, అదే పెద్దవాళ్లు కుడి, ఎడమ పిఎఫ్‌సిలు రెండింటినీ వాడతారు. వయసుపెరిగే కొద్దీ మెంటల్‌ విషయాల్లో ఈ రెండింటినీ పెద్దవాళ్లు ఉపయోగిస్తారు. మీడియేషన్‌ ఎనాలిసిస్‌ ద్వారా ఈ ఇంటరాక్షన్స్‌ను అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా ఫిట్‌నెస్‌ లేని పెద్దవాళ్ల కన్నా ఫిట్‌నెస్‌తో ఉన్న పెద్దవాళ్లు యంగ్‌స్టర్స్‌ ఉపయోగించిన రీతిలో తమ మెదడును ఉపయోగిస్తున్నారని తేలింది. మెంటల్‌గా కూడా వారెంతో ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడైంది. సో మీ మెదడు యంగ్‌గా ఉండడమనేది మీ శరీరంపైనే ఆధారపడి ఉందన్నమాట...పెద్దాళ్లు అయినా మీ మెదడు యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉండేందుకు రోజూ ఏరోబిక్‌, ఇతర వ్యాయామాలు చేస్తే బ్రెయిన్‌కు ముసలితనమే ఉండదు..