మలివయస్సుకి పీచు రక్షణ!

26-10-2017: యాభై సంవత్సరాలకి ముందు ఎలాంటి ఆహారం తీసుకున్నా, యాభై దాటిన తరువాత మాత్రం తాము తీసుకునే ఆహారంలో కచ్చితంగా పీచు ఉండే విధంగా చూసుకోవాలి అంటున్నారు ఆస్ట్రేలియా యూనివర్శిటీ పరిశోధకులు. యాబై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సుగల సుమారు 1500 మంది మీద వీరు సుదీర్ఘ కాలం పాటు అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరికి మామూలు ఆహారం అందించారు. మిగతా వారికి పీచు అధికంగా కలిగిన ఆహారాన్ని అందించారు. కొన్ని రోజుల అనంతరం వీరిని పరిశీలించగా, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్న వారిలో ఎక్కువమంది మునుపటి  కన్నా మరింత ఆరోగ్యంగా ఉండగా, పీచు తీసుకోని వారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు వీరి దృష్టికి వచ్చాయి. అవన్నీ సాధారణంగా వయస్సురీత్యా వచ్చే సమస్యలే అయినా, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వాటి బారి నుంచి చాలా వరకూ తప్పించుకోవచ్చు అని పరిశోధనాకారులు అంటున్నారు.