వయసును దాచేద్దాం...!

ఆంధ్రజ్యోతి, 17-07-2017: ముఖంలో కాస్త వయసు కనపడితే చాలు చాలామంది నిస్పృహకు లోనవుతుంటారు. కొందరైతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు కూడా. అలా కాకుండా నవయవ్వనులుగా కనిపించాలంటే కొన్ని యాంటి-ఏజింగ్‌ డైట్స్‌ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. అవేమిటంటే..

బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపిస్తారు. వయసు తెలియదు. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శారీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించగలరు.

చిలకడదుంప, కేరట్‌, గుమ్మడి కాయల్లో బెటా-కెరొటెనె అధికంగా ఉంటుంది. ఇవి ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కళ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయి.

ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు వయసు కనపడదు.

విటమిన్‌-సి పుష్కలంగా ఉన్న బ్రొకెల్లీ తింటే చర్మం ముడతలు పడదు. వయసుతోపాటు వచ్చే చర్మం పొడారిపోయే గుణం కూడా పోతుంది.

ట్యున్, సాల్మన్‌ చేపలు యాంటి-ఏజింగ్‌గా బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల యవ్వనంతో ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు.

ఆలివ్‌ నూనె వాడితే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మం, శిరోజాలు మెరుస్తుంటాయి.

కీర కూడా యాంటి ఏజింగ్‌ ఫుడ్‌. కీరలో నీరు బాగా ఉండడం వల్ల యంగ్‌ లుక్స్‌ పోవు. చర్మంపై ముడతలు పడవు.