పొద్దున్నే ఇలాచేస్తే బరువు బలాదూర్

ఆంధ్రజ్యోతి, 15-01-2018: స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఉదయాన్నేకొన్ని పనులు చేయడం వలన ప్రయోజనం చేకూరుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మధ్య వెల్లడైన ఒక సర్వే ప్రకారం, ఉదయన్నే సూర్య కిరణాలను ఆస్వాదించడం ద్వారా బరువు తగ్గవచ్చని నిరూపితమైంది. ఇలా చేయడం వలన రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. అలాగే ఉదయాన్నేవ్యాయామాలు చేయడం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ప్రోటీన్‌లు పుష్కలంగా ఉన్న అల్పాహారాలు బరువును నియంత్రించడంలో సహకరిస్తాయని తేలింది. ముఖ్యంగా, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉన్న పదార్థాలు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. లిఫ్టులు వాడడానికి బదులు మెట్లు ఎక్కండి. ఉదయాన్నే ఇలా యాక్టివ్‌గా ఉండే పనులు చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు చేయడంతో పాటు మెటబాలిజం రేటు కూడా మెరుగుపడుతుంది.