అధిక బరువును తగ్గించుకోవడానికి చక్కటి మార్గం

 వ్యాయామం డ్యాన్సు.. కలిపేస్తే అదుర్సు

అతివల కోసం ఏరోబిక్స్‌ ఎక్సర్‌సైజ్‌ 

మక్కువ చూపుతున్న మహిళలు 
ఆనందంతో ఆరోగ్యం

మహిళలు, యువతులు నేడు నాజుకుతనం వైపు ఎక్కువగా చూస్తున్నారు. నలుగురిలో చలాకీగా కన్పించాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ కష్టపడకుండా ఆనందంతో ఆరోగ్యం పొందేందుకు ఎరోబిక్స్‌ ఎక్సర్‌సైజ్‌ ఎంతో ఉపయోగపడుతుంది. గంటల కొద్ది పడకలు, వ్యాయామాలు, మందుల వాడకం వంటివి లేకుండా ఈ ఎరోబిక్స్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల ఆనందంగా ఆరోగ్యం పొంద వచ్చు. డ్యాన్సులాంటి వ్యాయామంతో శరీరానికి చెమటలు పట్టించి.. కేలరీలను మండించొచ్చు.

ఎరోబిక్స్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే

శరీరపరమైన ఇతర మార్పులేమీ జరగకుండా ఊపిరి వేగంగా పీల్చడం, హృ దయ స్పందన రేటు పెరగడం, కండరాల కదలికలు ఎక్కువగా ఉంచేందుకు దోహద పడే ఎక్సర్‌సైజ్‌ను ఎరోబిక్స్‌ ఎక్సర్‌సైజెస్‌ అంటారు. వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, డ్యాన్సచేయడం వంటివ న్ని ఏరోబిక్స్‌ ఎక్సర్‌సైజెస్‌ కిందకే వస్తాయి. ఈ ఎక్సర్‌సైజెస్‌ చేయడం ద్వారా ఊపిరితి త్తులు పర్యావరణం నుంచి ఆక్సిజనను ఎక్కువ మోతాదులో తీసుకుంటాయి. గుండె, రక్తనాళాలు, ఆ ఆక్సిజనను ఇతర పోషకాలను ప్రతీ కణానికి చేరుస్తాయి. కేలరీలను కరిగించడానికి కండరాలు పనిచేసేందుకు ఇవి అవసరం. ఏరోబిక్స్‌ వ్యాయామం వల్ల శరీరంలోని మంచి కొలసా్ట్రల్‌ను పెంచుతుంది. చెడు కొలసా్ట్రల్‌ను తగ్గిస్తుంది. 

బరువు తగ్గించడానికి

శరీరంలోని కొవ్వును తగ్గించి బరువును తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నవారికి ఈ ఎక్సర్‌సైజు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నిర్ణీత శాస్ర్తీ పద్ధతిలో కొవ్వు తగ్గడం వల్ల శరీరానికి ఎలాంటి అపాయం జరుగదు. జీవక్రియలకు ఎలాంటి ఆటంకం లేకుండా సమజ సిద్ధంగా బరువు తగ్గుతుంది. ఒత్తిడిని దూరం చేయడం, బీపీ, శ్వాస సంబంధ వ్యాధులు దూరం, రోజంతా ఉత్సాహంగా ఉండటం, అలసటను తగ్గిస్తుంది.