అధిక బరువు తగ్గాలంటే...

ఆంధ్రజ్యోతి (26-11-2019): బరువు తగ్గాలంటే అందుకు తోడ్పడే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. వాటిలో చెప్పుకోదగినది ‘ఆయర్వేద జలం’! శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే ఆ జలాన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...
 
కావలసిన పదార్థాలు:
ధనియాలు: అర టీస్పూను,
జీలకర్ర: అర టీస్పూను,
సోంపు: అర టీస్పూను,
కాచిన నీళ్లు: 4 కప్పులు.
 
తయారీ ఇలా:
మరిగే నీళ్లలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి నాననివ్వాలి. కొద్దిసేపటి తర్వాత వడగట్టి రోజంతా తాగుతూ ఉండాలి.
ఉపయోగాలు:
ఆయుర్వేద జలం శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొడుతుంది.
జీర్ణక్రియను సరిచేసి, మెటబాలిజంను పెంచుతుంది.
కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఒంట్లో నీరు నిల్వ ఉండకుండా చూస్తుంది.
శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది.