గ్రీన్‌ టీ సప్లిమెంట్స్‌తో జాగ్రత్త..

ఊబకాయం వల్ల మానవులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి అనేక పద్దతులు అనుసరిస్తారు. అయితే బరువు తగ్గడానికి ఉపయోగించే గ్రీన్‌ టీ సప్లిమెంట్స్‌ను వాడడం వల్ల అనేక సైడ్‌ ఎఫెక్ట్స్‌తో పాటు, కాలేయ సంబంధిత వ్యాధుల వస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది. గ్రీన్‌ టీ సప్లిమెంట్స్‌ను తీసుకోబోయే కొన్ని వారాలు లేదా నెలల ముందు గ్రీన్‌ టీని తాగడం అలవాటు చేసుకుంటే సప్లిమెంట్స్‌ వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకూండా ఉంటాయని ఈ పరిశోధనలో తెలిసింది. గ్రీన్‌ టీ సప్లిమెంట్స్‌ని వినియోగించకుండా గ్రీన్‌ టీ తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చునని పరిశోధకులు తెలియజేశారు. వ్యామాయం చేయడం వల్ల తగ్గే బరువు కన్నా గ్రీన్‌ టీ తాగడం వల్ల తొందరగా బరువు తగ్గుతారనే విషయం కూడా ఈ అధ్యయనంలో తెలిసింది. గ్రీన్‌ టీ సప్లిమెంట్స్‌ కారకాల కారణంగా కాలేయం విషతుల్యం కాకుండా గ్రీన్‌ టీలో ఉండే పాలీఫినాల్‌ ఎపీ గల్లోకెటాచిన్‌-3-గల్లటే (ఈజీసీజీ) పరిరక్షిస్తాయి.