ఎక్కువసేపు కూర్చుంటే..

 3-10-15

ఆఫీసులో వర్కు చేస్తూ గంటల తరబడి ఒకచోటే అలాగే కూర్చోవడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. ముఖ్యంగా ఫిట్‌నె్‌సతో ఉండాలని కోరుకునే వారు ఈ అలవాటును ఎంత వదిలించుకుంటే అంత మంచిది. దీనికి మార్గం సింపుల్‌. కుర్చీకి అతుక్కుపోయి కూర్చోకుండా మధ్య మధ్యలో ‘బ్రేక్‌’ తీసుకుని అటు ఇటు తిరుగుతుండాలి.  ఎక్కువసేపు కూర్చోవడం గురించి కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ అధ్యయనకారులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. ఎక్కువ గంటలు అలాగే కూర్చోవడం వల్ల వ్యాయామాలు చేసినా ఫిట్‌నె్‌సలోగాని, ఆరోగ్యంలో గాని మంచి ఫలితాలు కనపడవని వీరు అన్నారు. వ్యాయామాలకంటే కూడా కూర్చునే సమయాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వీరు నొక్కిచెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి ఎలాంటి నూతన మార్గాలూ అన్వేషిస్తున్నారు. వాటిలో ఆఫీసుల్లో సిట్‌-స్టాండ్‌ డెస్క్‌లుండాలన్నది వాటిల్లో ఒకటి. ఎవరికి వారు సిట్టింగ్‌ టైమును తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఎక్కువ సేపు కూర్చున్నావని హెచ్చరించొద్దని... వ్యక్తులను నడిచేలా ప్రోత్సహించడాన్ని సూచిస్తున్నారు.