కొవ్వు కరిగించే పానీయం!

24-06-2019: సాధారణంగా పొట్ట, పిరుదులు, తొడల్లోనే ఎక్కువగా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించడానికి పాటించే ఆహార నియమాల్లో అల్లం నీళ్లు కూడా చేర్చుకోవాలి.

అల్లం నీళ్లు శరీరంలోని విషాలను బయటకు వెళ్లగొట్టి, మెటబాలిజంను పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా తలెత్తే వ్యాధుల నుంచి కూడా రక్షణ దొరుకుతుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచి, రక్తనాణాల్లో రక్తం గడ్డలు కట్టకుండా నియంత్రించే శక్తి అల్లం నీళ్లకు ఉంటుంది. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ఆర్థ్రయిటిస్‌ మొదలైన కీళ్ల నొప్పుల నుంచి రక్షణ అందిస్తాయి. కొన్ని రకాల కేన్సర్లు రాకుండా చేయడంలో కూడా అల్లం నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఈ పానీయం ఎలా తయారు చేయాలంటే....

కావలసిన పదార్థాలు:

100 గ్రాముల అల్లం సన్నగా తరగాలి, 5 లీటర్ల నీళ్లు, నిమ్మరసం కొద్దిగా.

తయారీ ఇలా: నీళ్లలో అల్లం ముక్కలు వేసి మరిగించి, 15 నిమిషాలపాటు చిన్న మంట మీద ఉంచాలి. తర్వాత చల్లార్చి వడగట్టి, నిమ్మరసం కలుపుకోవాలి. ఈ పానీయాన్ని కప్పు పరిమాణంలో, ప్రతి రోజూ ఉదయం అల్పాహారానికి ముందు, రాత్రి భోజనానికి ముందు తాగుతూ ఉండాలి.