కొవ్వును కరిగిద్దామిలా..

08-01-2019: తొడ భాగంలో కొవ్వు పేరుకుపోతే ఇబ్బందిగా ఉంటుంది. తేలికపాటి వ్యాయామాలతోనే తొడ కండరాలను షేప్‌లోకి తేవచ్చు. ఈ ఎక్సర్‌సైజ్‌లతో తొడ భాగంలోని కొవ్వును కరిగించవచ్చు.
 
రన్నింగ్‌: పరిగెత్తడం వల్ల తొడభాగంలోని కొవ్వు కరిగిపోతుంది. తొడ కండరాలు షేప్‌లోకి వస్తాయి కూడా. తొడ కండరాలు, పాదాలకు వరకు రన్నింగ్‌ మంచి ఎక్సర్‌సైజ్‌.
 
ఏరోబిక్స్‌: ఎక్కువ క్యాలరీలను కరిగించేందుకు ఏరోబిక్స్‌ను మించిన వ్యాయామం మరొకటి లేదు. శరీరం నుంచి లవణాలు, విషపదార్థాలు బయటకు పంపేందుకు ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి. తొడ భాగంలోని కొవ్వుతో పాటు రక్తపోటు, కొలెస్ర్టాల్‌ను తగ్గిస్తాయి.
 
లెగ్‌ రెయిజ్‌: నేలమీద పడుకొని, రెండు కాళ్లను నెమ్మదిగా పైకి ఎత్తడం వల్ల కాలి కండరాలకు వ్యాయామం లభిస్తుంది. శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.