స్థూలకాయంతోనూ కేన్సర్‌!

స్థూలకాయంతోనూ కేన్సర్‌!
 
 
కోపెన్‌హగెన్‌, జనవరి12: స్థూలకాయం.. ప్రాణాంతక వ్యాధులకు కారణ‘భూతం’గా మారుతోందని డెన్మార్క్‌లోని ఆర్హస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. స్థూలకాయంతో శరీర బరువు అధికమవుతున్న కొద్దీ కేన్సర్‌ ముప్పు 12ు మేర పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 1977 నుంచి 2016 మధ్యకాలంలో చికిత్సపొందిన 3,13,321 మంది స్థూలకాయ బాధితుల ఆరోగ్య నివేదికలను విశ్లేషించారు. వారిలో 20,706 మంది కేన్సర్‌ బారిన పడగా, ఇంకొందరు హృద్రోగాలు, మధుమేహంతో సతమతమైనట్లు గుర్తించారు.