మసాలా ఛాయ్‌తో క్యాలరీలు కట్‌...

15-07-2019: బరువు తగ్గేందుకు గ్రీన్‌ టీ తాగుతారు చాలామంది. ఘాటుగా, టేస్టీగా ఉండే మసాలా చాయ్‌ తాగినా క్యాలరీలు ఖర్చవుతాయి. దీనిలోని మసాలా దినుసులు క్యాలరీలను కరిగిస్తాయి. అంతేకాదు తలనొప్పి, గొంతు నొప్పి వంటివి క్షణంలో మాయమైతాయి.
తయారీ: లవంగాలు, నల్లమిరియాలు, సోంపు గింజల్ని పెనం మీద వేగించాలి. దాల్చిన చెక్క కూడా వేసి అర నిమిషం వేగించాలి. మంట ఆర్పేసి, అల్లం పొడి వేసి కలపాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని మెత్తని పొడి చేసుకొని, సీసాలో భద్రపరుచుకోవాలి. టీలో ఈ పొడిని సగం టేబుల్‌ స్పూను వేస్తే చాలు. వేడివేడి మసాలా ఛాయ్‌ రెడీ.