బరువును బ్యాలెన్స్‌ చేద్దామిలా!

18-06-2019: బరువు తగ్గడమే కాదు... ఒకే బరువుతో ఉండటం కూడా చాలాముఖ్యం. అంతేకాదు.. ‘గతంలో అధిక బరువుకు కారణమైన అలవాట్లకు దూరంగా ఉండడం అవసరం’ అంటున్నారు ఫిటెనెస్‌ నిపుణురాలు దినాజ్‌. ఆమె చెబుతున్న చిట్కాలివి...
 
వీటిని తగ్గించాలి: ఆహారంలో అలంకరణ, రుచి కోసం వాడే వివిధ రుచికరమైన పదార్థాల వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరతాయి. దీని వల్ల మెదడు నియంత్రణ కోల్పోతుంది. ఆకలి పెరుగుతుంది. దాంతో ఎక్కువగా తినేస్తారు.
 
బంధాలు: మంచి ఆహార అలవాట్లున్న వారిని అనుసరించాలి. బరువు తగ్గాలనే విషయంలో మీలాంటి ఆలోచనలున్న వారితో స్నేహంగా ఉంటే బరువు అదుపులో ఉంచుకోవడంలో వారు మీకు సహకరిస్తారు.