ఒత్తిడిని చిత్తుచేద్దాం!

ఆంధ్రజ్యోతి, 10-07-2018: ఒత్తిడి నేడు సర్వాంతర్యామిలా తయారైంది. పనికి సంబంధించిన డెడ్‌లైన్‌ వల్ల కావచ్చు. సాటి వారితో పోటీవల్ల కావచ్చు. చివరికి ట్రాఫిక్‌జామ్‌ వల్ల కావచ్చు. ఈ ఒత్తిడి అలా కొనసాగుతూనే ఉంది. దీనివల్ల మనిషి లోని ప్రాణశక్తి, వ్యాధి నిరోధక శక్తి హరించుకుపోతాయి. ఇతర పరిణామాలుగా అధిక రక్తపోటు, మధుమేహం, ఉదర సంబంధమైన అల్సర్లు తయారవుతాయి.. చివరికి ఇది డిప్రెషన్‌కు కూడా దారి తీయవచ్చు. వీటినుంచి బయటపడటానికి యోగా ప్రాణాయామాలు ఎలాగూ మేలు చేస్తాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేకమైన పానీయాలు కూడా సేవిస్తే, ఒత్తిడి నుంచి బయట పడేందుకు తోడ్పడతాయి. అలాంటి పానీయాల్లో కొన్ని..... 

తులసి- టీ: హార్మోన్లను సమస్థితికి తీసుకురావడం ద్వారా ఒత్తిడినీ, ఆందోళలనను తగ్తిస్తుంది.
క్యారెట్‌, టమోటో రసం: ఈ రెండూ ఫైబర్‌తో ఉన్నవే. ఇవి శక్తినిలువల్ని పెంచుతాయి. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఐస్‌ కలిపిన బొప్పాయి- టీ: బొప్పాయికి దేవతా ఫలం అన్న పేరుంది. దీన్ని బట్టి ఈ పండు విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. దీనిలో ఉండే కెరోటనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఒత్తిడిని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.
అల్లం, నిమ్మ నీళ్లు: అల్లంలో జింజెరాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి వేళల్లో శరీరంలోంచి ఉత్పన్నమయ్యే హానికారక రసాయనాలను శరీరంలోంచి బయటికి పంపిస్తాయి.
చామంతి-టీ : ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనసును ప్రశాంత పరుస్తుంది.