నవ్వకపోతే నష్టమే!

 మనిషిలోని స్వచ్ఛమైన నవ్వుకి, ముఖంలోని హావభావాలకి దగ్గర సంబంధం ఉన్నట్లే శరీరంలో జరిగే పలు రసాయన మార్పులకి కూడా సంబంధం ఉంటుంది. శరీరంలో ఎంజైములు, హార్మోనులు విడుదల కావడానికి ఆరోగ్యవంతమైన నవ్వు దోహదపడుతుంది. ఎంజైములు, హార్మోన్లు శరీర అవయవాల పనితన్నాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధకులు తెలిపారు. రక్తపోటుతో బాధపడేవారు రక్తపోటును క్రమబద్దీకరించుకునేందుకు మందులతో పనిలేకుండా ప్రతిరోజు కాసేపన్నా మనసారా నవ్వుతుంటే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుందని పరిశోధకులు సూచించారు. హార్మోన్లలో అసమానతల కారణంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆ సమయంలో మనసారా నవ్వితే శరీరంలోని హార్మోను ఉత్పత్తుల హెచ్చుతగ్గులను క్రమబద్దీకరిస్తుంది.