డిప్రెషన్‌ను తరిమే వాల్‌నట్స్‌!

11-02-2019: వాల్‌ నట్స్‌ తరచుగా తింటూ ఉంటే డిప్రెషన్‌ దరి చేరకపోగా, ఏకాగ్రత పెరుగుతుందని కేలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఇతర నట్స్‌ తినేవారితో పోలిస్తే, వాల్‌ నట్స్‌ తినే వారిలో డిప్రెషన్‌ స్థాయులు 26% తగ్గినట్టు తాజా అధ్యయనంలో బయల్పడింది. వీటిని తినడం వల్ల శక్తి అత్యధికంగా సమకూరడంతోపాటు ఏకాగ్రత కూడా సమకూరుతున్నట్టు పరిశోధకులు తమ అధ్యయనం ద్వారా కనుగొన్నారు. కాబట్టి డిప్రెషన్‌ను దూరం చేయడానికి మందులకు బదులుగా ఆహార మార్పుల్లో భాగంగా వాల్‌నట్స్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం.