కాలేయం జబ్బులకు హోమియోలో చికిత్స!

07-11-2017: ప్రస్తుతం జీవిన విధానం, ఆహరపు అలవాట్లలో మార్పులతో కాలేయ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి ముదిరి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఆహారంలో తీసుకునే కొవ్వు పరిమాణం పెరుగుతోంది. కడుపులో కుడి భాగాన ఉదర విధానం కింద కాలేయం ఉంటుంది. కాలేయానికి రెండు లోట్స్‌ ఉంటాయి. వీటిలో 4 విభాగాలుంటాయి. వీటిని సెగ్మెంట్స్‌ అంటారు. కాలేయంలో ప్రతి సెగ్మెంటుకు రక్త ప్రసరణ చేసి, తిరిగి వెనక్కు తెచ్చే నాళాలుంటాయి.

 
కాలేయం జీర్ణ వ్యవస్థలో అనుబంధ గ్రంధిగా ఉండి పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఇందులో ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరంబిన్‌ బైలివర్టిన్‌ అనే వర్ణకాలు కలిగి ఉండి, కొవ్వుల విశ్లేషణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయం సుమారు 100 రకాల విధులను నిర్వహిస్తుంది. కాలేయంలోని 20-25 శాతం భాగం పనిచేసినా కూడా శరీరంలో విధులు నిర్విఘ్నంగా జరుగుతాయి. కాలేయం ఆహారం జీర్ణం చేయడానికి, శక్తిని నిల్వ ఉంచడానికి, వ్యర్థ పదార్థాలు బయటకు పంపడానికి సహాయపడు తుంది. కాలేయం వాపుని హెపటైటిస్‌ అని అంటారు.
 
ఇది బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మజీవులు కొన్ని రకాల మందులు, వివిధ కారణాల చేత వస్తుంది. వాటిలో వైరస్‌ వంటి సూక్ష్మజీవులు కొన్ని రకాల మందులు, వివిధ కారణాలతో వస్తుంది. వాటిలో వైరస్‌ వల్ల కలిగే హెపటైటిస్‌ను వైరల్‌ హెపటైటిస్‌ అని అంటారు. వీటిని హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌... ఆరు రకాలుగా విభజించారు. ఇందులో ఎ, బి, సి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి. కాలేయ సమస్యల ఇన్ఫెక్షన్‌, ప్రధానంగా హెపటైటిస్‌, ఎ, బి, సి, డి, ఇ అనే వైరస్‌ల కారణంగా రావచ్చు. లేదా దీర్ఘకాలికంగా తీసుకున్న ఆల్కహాల్‌ వంటి పదార్థాల వల్ల, వంశపారంపర్యంగా అయినా రావచ్చు. కాలేయానికి ముఖ్యంగా హెపటైటిస్‌, సిర్రోసిస్‌, ఆల్కహాలిన్‌ లివర్‌ డిసీజ్‌, హిక్రొమటోనిస్‌, విలెసన్సే డిసీజే, ఫ్యాటీ లివర్‌, కేన్సర్‌, గిలబర్ట్స్‌ సిండ్రోమ్‌, పసరికలు వంటి జబ్బులు వస్తాయి.
 
కారణాలు
కలుషిత ఆహారం లేదా నీరు తీసుకోవడం
వ్యాయామం లేకపోవడం ఫ మత్తు పదార్థాలు, పొగ తాగడం
శరీరానికి హానిచేసే మందులను ఎక్కువ మోతాదులో వాడటం
వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది, ఫ ఇన్షెక్షన్స్‌, రక్తమార్పిడి
 
లక్షణాలు
బరువు తగ్గటం, గాయాలు తొందరగా తగ్గకపోవడం
జీర్ణ సమస్యలు, ఫ మలబద్ధకం, ఆర్షమొలలు
త్రేన్పులు రావడం , ఫ నీరసం, ఆకలి మందగించడం
వికారం, శరీర భద్రతా వ్యవ స్థ లోపించడం
సమస్య ముదిరిన కొద్దీ ముక్కునుంచి రక్తస్రావం కావటం, కాళ్ల వాపు
మందులకు స్పందించకపోవటం, జీర్ణాశయంలోని సిరలు వ్యాకోచించడం.

జాగ్రత్తలు

కాలేయ సంబంధ వ్యాధులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే చాలా తేలికగా నయం చేసుకోవచ్చు.
కొవ్వు, ప్రొటీన్లు, తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
మద్యపానం మానేయాలి , ఫ సమతులాహారం తీసుకోవాలి
రోగ నిరోధ వ్యవస్థను బలోపేతం చేసుకునేటట్లు జీవన శైలిని మార్చుకోవాలి.
 
నిర్థారణ పరీక్షలు
సీబీపీ, ఈఎస్‌ఆర్‌, ఫ లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ (ఎల్‌ఎఫ్‌టీ)
బైల్‌ సాల్ట్స్‌, బైల్‌ పిగ్‌మెంట్స్‌, ఫ ఎస్‌జిపిటీ, ఎస్‌జిఓటీ
ప్లేట్‌లెట్‌ కౌంట్‌, క్లాటింగ్‌ టైమ్‌
 
హోమియో చికిత్స
హోమియోపతిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచి, కాలేయం పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన మందులు ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. వ్యక్తి యొక్క మానసిక, శారీరక లక్షణాలను పరిగణలోకి తీసుకొని మందులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. తిరుమెట్‌, కల్కేరి, ఆర్స్‌, కార్టస్‌మార్‌, బెలడోనియం, లైకోపోడియం, నాటమ్‌సల్ఫ్‌, మెర్క్‌సాల్‌, నక్స్‌వామిక్‌ వంటి మందులు కాలేయ చికిత్సలో మంచి గుణం చూపుతాయి. ఈ మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. తద్వారా కాలేయ సమస్యలను సమూలంగా నయం చేయవచ్చు. కాలేయ సమస్యలు చిన్న పిల్లలు నుంచి వృద్ధుల వరకు ఎవ్వరికైనా రావచ్చు.
 
 
డాక్టర్‌ మురళీ అంకిరెడ్డి, ఎం.డి. హోమియో
స్టార్‌ హోమియో, ఫోన్‌- 8977 336677,టోల్‌ఫ్రీ :1800-108-5566
www.starhomeo.com
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, దుబాయ్‌, లండన్‌, మాంచెస్టర్‌