అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులే..
ఆశించిన స్థాయిలో లేని కాలేయ దానం
హైదరాబాద్, 18-04-2018: మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. కాలేయ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ రకాల వ్యాధులు కాలేయాన్ని చుట్టుముడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కాలేయం మారిస్తే తప్ప రోగి బతికే పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రేటర్ పరిధిలో వారంలో నాలుగు నుంచి ఐదు వరకు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి, సుమారు రెండు వేల మంది వరకు బాధితులు ఉన్నట్లు ఓ అంచనా.. ఈనెల 19న ప్రపంచ కాలేయదినం సందర్భంగా కాలేయానికి సొకే వ్యాధులు.. ముందస్తు జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం.
కాలేయ జబ్బులు..
హైపటైటి్స్-బీతో పాటు అల్కహాల్ కారణంగా, పుట్టుకతో లీవర్‌కు వ్యాధులు సోకుతున్నాయి. లీవర్ కేన్స ర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. వైరల్ ఇన్ ఫెక్షన్, కొన్ని మందుల్ని అతిగా తీసుకోవడం, అధిక బరువు వల్ల ఫ్యాటీలీవర్ లాంటి వ్యాధులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. బై గ్లిజరైడ్ ఫాట్, సిర్రోసిస్ వంటివి సైతం కాలేయాన్ని చుట్టుముడుతున్నట్లు వివరించారు. లీవర్ జబ్బులు ఎక్కువగా పురుషుల్లో ఉంటున్నాయన్నారు. ఆల్కాహాల్ ఎక్కువగా తాగడమే ఇందుకు కారణమని అంటున్నారు.
ప్రారంభ దశలోనే గుర్తించాలి
కాలేయం జబ్బులను ప్రారంభ దశలో గుర్తిసే మందులతో నయం చేయవచ్చునని వైద్యులు తెలిపారు. లివర్ ఫంక్షన్ పరీక్షలు, హైపటైటిస్, అల్ర్టాసౌండ్ పరీక్షలు చేసి వ్యాధిని గుర్తిస్తామని, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సలు చేయాల్సి ఉంటుందన్నారు. హైపటైసిస్-బీ వ్యాధి వల్ల వచ్చే లివర్ జబ్బును మందుల వల్ల తగ్గించడానికి ఆస్కారముందని వైద్యులు చెప్పారు. లివర్ కేన్సర్‌ను కూడా ఆపరేషన్ ద్వారా నయం చేసి జీవిత కాలాన్ని పెంచుకోవడానికి అవకాశముందని వివరిస్తున్నారు.
కారణాలు ఇవీ..
అల్కాహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఎక్కువగా పాడైపోయే ప్రమాదముంది.
వైరస్, హెపటైటీస్ బీ, హెపటైటీస్ సీ వల్ల కూడా లివర్ దెబ్బతినే అవకాశాలున్నాయి.
జాండీస్ వస్తే కాలేయం పనితీరు మందగించినట్లుగా భావించాలి.
ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం దెబ్బతినే అవకాశముంది.
అధిక బరువు వల్ల పేరుకుపోయిన కొవ్వు వల్ల కాలేయం దెబ్బతింటోంది.
కొన్ని రకాల మందుల కారణంగా కాలేయం పనితీరు మందగించి జబ్బులకు దారి తీస్తుంది.
తిరిగి పెరిగే కాలేయం
కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. ఆ స్థాయిలో కాలేయ దానం చేసేందుకు ముందుకు రావడంలేదు. కాలేయం దానం చేస్తే ఆరోగ్యానికి హానికరమన్న భావనలో ఉండటంతో ఎవరూ ముందుకు రావడం లేదు. జీవితాంతం శరీరంలో పెరిగే ఏకైక అవయం కాలేయం. 30 శాతం లివర్ ఉన్న వ్యక్తి తన పనులన్నింటినీ స్వయంగా చేసుకోగలిగే సమర్థత ఉంటుందన్నారు. కాలేయం తనకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడే అవయం. కాలేయంలో 60 శాతం దానం చేసినా ఆరోగ్యం బతకవచ్చు. రెండు మూడు నెలల్లో కాలేయం పూర్వ స్థితికి చేరుకుటుంది. సరైన అవగాహన లేక చాలా మంది లివర్ జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. మరొకరికి ఉపయోగపడే ఈ అవయాన్ని ఆధునిక జీవన శైలి అలవాట్లతో నష్టం కల్గిస్తున్నారు.ఎవరు దానం చేయవచ్చు..
18 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా కాలేయంలో కొంత భాగం దానం చేయవచ్చు.
దాతకు 3 నుంచి 6 నెలల్లో కాలేయం తిరిగి పూర్వస్థితికి వస్తుంది.
బ్రెయిన్ డెడ్ అయిన వారి కాలే యం దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలి.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
అల్కాహాల్, డ్రగ్గ్ లాంటి అలవాట్లకి దూరంగా ఉంటే లివర్ సి ర్రోసిస్ కు దూరంగా ఉండవచ్చు.
పొట్టప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా జాగ్రత్త పడడాలి.
వైరల్ ఇన్ఫెక్షన్, అపరిశుభ్రత నీరు, ఆహారం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
తెలుసుకోండి...
పెద్దల్లో 42 నుంచి 55 వయసు ఉన్న వారికి కాలేయ జబ్బులు వస్తున్నాయి. పిల్లల్లో 1, 2 సంవత్సరాల వారికి పుట్టకతో కాలేయ జబ్బులు వస్తున్నాయి.
కడుపులో నొప్పి, రక్తం వాంతులు, కామెర్లు, మలవిస్తర్జనలో రక్తం పడడం, కడుపులో నీరు చేరడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే లివర్ కేన్సర్‌గా అనుమానించాలి.
కాలేయం వ్యాధుల్ని ప్రథమ దశలోనే గుర్తించి చికిత్సపొందడంతో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఆల్కాహాల్, డ్రగ్ లాంటి అలవాట్లను వదులుకుంటే లివర్ సిర్రోసిస్ కు దూరంగా ఉండవచ్చు.
వైరల్ ఇన్ఫెక్షన్, అపరిశుభ్రత నీరు, ఆహారం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
పొట్టప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా జా గ్రత్త పడడం వల్ల ఫ్యాటీ లి వర్ను నియంత్రించవచ్చు.
లివర్‌లో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే నీటిబుడగలను ల్యాప్రొస్కోపిక్ లేకపోతే ఓపెన్ సర్జరీ ద్వారా చేయడానికి వీలుంది.
కాలేయంలో వచ్చే సాధారణ కణతలు, కేన్సర్ కారక కణతలను ఆపరేషన్ ద్వారా తొలగించే వీలుంది.
కేన్సర్ కణతలను ల్యాప్రోస్కిపిక్ సర్జరీ ద్వారా తొలగించి రోగికి పూర్తిగా స్వస్థత చేకూర్చవచ్చు.
పిల్లలో వచ్చే కాలేయ జబ్బులకు మూడు నెలల్ల్లో ఆపరేషన్ చేసి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవకాశముంది.
ఒకరి కాలేయం ఇద్దరు రోగుల కూ ఏర్పాటు చేయవచ్చు. ఎవరికి ఎంత శాతం అవసరమో అంతే అమర్చవచ్చు.
రోగుల బంధువులు ఒకరికొకరు కుండ మార్పిడి పద్ధతిలో కాలేయం దానం చేయవచ్చు.