కాలేయ వ్యాధులు కనుమరుగు

18-02-13

 
మనిషి శరీరంలో కాలేయం అత్యంత కీలకమైనది. శరీరంలో పేరుకుపోతున్న హానికారక పదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కాలేయంకు వ్యాధి సోకితే (సిర్రోసిస్‌) దాని ప్రభావం మొత్తం శరీరవ్యవస్థపై పడుతుంది. కాలేయ సంబంధ సమస్యలు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బాధిస్తున్నాయి. అజీర్తి నుంచి సిర్రోసిస్‌, లివర్‌ కేన్సర్‌ దాకా కాలేయ సంబంధ వ్యాధులను హోమియో చికిత్సతో సమర్ధవంతంగా తగ్గించవచ్చని అంటున్నారు ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డాక్టర్‌ మురళి అంకిరెడ్డి. 
 
 
కాలేయం జీర్ణవ్యవస్థకు తోబుట్టువులాంటిది. మనం తీసుకునే ఆహారాన్ని పేగులే జీర్ణం చేస్తాయి. తీసుకున్న ఆహారాన్ని శరీర కణాలు యదాతధంగా స్వీకరించలేవు. వాటిని శరీరానికి అనుగుణంగా మార్చే ప్రక్రియలో కాలేయం ప్రధానపాత్ర పోషిస్తుంది. సుమారు వంద రకాల విధులను నిర్వర్తిస్తుంది. కాలేయకణాలను హెపాటోసైట్‌ అని అంటారు. ఇవి శక్తి సమతుల్యతను క్రమబద్ధీకరించడంతో పాటు రోగకారక క్రిములతో పోరాటం చేస్తాయి. హానికారక పదార్థాలను వేరుచేస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడే బైల్‌(పిత్తరసం)ను ఉత్తత్తి చేస్తాయి. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే పదార్థాలను (క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌)ను తయారుచేయడం, పోషకపదార్థాలు, విటమిన్లను నిలువచేయడం, గ్లూకోజ్‌, కొలెస్ట్రాల్‌ వినియోగంలో, అన్యపదార్థాల విసర్జన వంటి పనులను కాలేయం నిర్వర్తిస్తుంది. కాలేయం పనితీరును, కాలేయ వ్యాధులను గుర్తించడానికి ఒక్క పరీక్ష సరిపోదు. వీటిని గుర్తించడానికి చేయు విభిన్న పరీక్షల సముదాయంను లివర్‌ ప్రొఫైల్‌ అని అంటారు. 
లివర్‌ వ్యాధులకు కారణాలు 
హెపటైటిస్‌ ఎ,బి,సి,డి,ఇ వైరస్‌ల కారణంగా, దీర్ఘకాలంగా మందులు వాడుతుండటం, అధిక మోతాదులో వేసుకోవడం వల్ల, రసాయనిక పదార్థాల వల్ల లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  ఎక్కువ మోతాదులో ఆల్కహాల్‌ సేవించే వారిలోను కాలేయ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ల వల్ల కూడా కాలేయ సమస్యలు రావచ్చు. 
సిర్రోసిస్‌ అంటే ఏమిటి?
చర్మం పై భాగంలో వలే వ్యాధి కారణంగా నష్టపోయిన కాలేయ కణాల స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్తగా ఏర్పడిన ఈ కణాలు సాధారణ ఆరోగ్య కాలేయ కణాల వలే శక్తివంతంగా పనిచేయలేవు. అంతేకాకుండా కాలేయంలోకి వచ్చే రక్తప్రసరణకు ఆటంకం కలగిస్తాయి. కొత్త కాలేయ కణజాలం పెరిగిన కొలది కాలేయం సమర్ధవంతంగా తన విధులను నిర్వహించలేకపోతుంది. ఈ స్థితిని సిర్రోసిస్‌ అని అంటారు. 
లక్షణాలు
ప్రాథమిక స్థితిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. నీరసం, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి తగ్గుదల, బరువు తగ్గుట వంటి లక్షణాలుంటాయి. 
సిర్రోసిస్‌ పెరిగిన కొద్దీరక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం జరుగుతుంది. కాళ్లలో వాపు, మందులకు అదనంగా రియాక్ట్‌ కావడం, ఈసోఫేగస్‌, జీర్ణాశయంలలోని సిరలు వ్యాకోచించడం జరుగుతుంది. కాలేయం పనిచేయడం తగ్గిపోవడంతో హానికర పదార్థాలు రక్తం ద్వారా ముఖ్య అవయవాలకు చేరడం వల్ల వాటి పని తీరు తగ్గిపోతుంది. అరుదుగా ఈ సమస్యతో రోగి అపస్మారక స్థితిలోకి కూడా వెళతారు. సిర్రోసిస్‌తో బాధపడే రోగులలో 5 శాతం మందిలో లివర్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 
నివారణ ఎలా?
ప్రాథమిక స్థితిలోనే రోగ కారకం, స్థితిని గుర్తించి చికిత్స తీసుకుంటే సిర్రోసిస్‌ను నివారించవచ్చు. రక్తంలోని ఎంజైమ్‌ల పరీక్ష, అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ వంటి పరీక్షల ద్వారా కాలేయంలో వచ్చే మార్పులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించవచ్చు. ఆల్కహాల్‌ అలవాటు ఉంటే మానేయడం, కొవ్వు తక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం చేయాలి. డాక్టర్‌ సలహా లేకుండా సాధారణ రుగ్మతలకు శక్తివంతమైన యాంటీబయోటిక్స్‌ వాడటం మంచిది కాదు.  
హోమియో చికిత్స
రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచి కాలేయ పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన మందులు హోమియోలో ఉన్నాయి. ఈ మందులు ఎట్టి దుష్పభావాలు లేకుండా భౌతిక, ప్రకృతి సూత్రములకు లోబడి పనిచేస్తాయి. రోగలక్షణాలతో పాటు శారీరక, మానసిక లక్షణాలను పరిగణలోకి తీసుకుని చికిత్స అందించాల్సి ఉంటుంది. కింది మందులు కాలేయ వ్యాధుల నివారణలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఆరంమెట్‌ : లివర్‌ సిర్రోసిస్‌, జలోదరం, బూడిద రంగు మలం, నోట్లో నుంచి దుర్వాసన, లేత ఆకుపచ్చ, గోధుమ రంగులో మూత్రం రావడం వంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది. 
కాల్కేరియ ఆర్స్‌ : మూత్రంలో ఆల్బ్యుమిన్‌తో లివర్‌ సిర్రోసిస్‌ ఉన్నప్పుడు తీసుకోదగిన ఔషధం.
కార్డస్‌మార్‌ : కాలేయభాగంలో నొప్పి, నొక్కినా, ఎడమ వైపు పడుకున్నా నొప్పి ఎక్కువకావడం, కామెర్లు, సంధాయక ధాతువులు వృద్ధి చెంది గట్టిపడుట, లివర్‌పై భాగంలో సాధారణ నొప్పి, జీర్ణాశయంలో మెలిపట్టినట్టుగా నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు వాడదగిన ఔషధం.
బెలిడోనియం : కాలేయం పరిమాణం పెరగడం, కాలేయ భాగంలోని నొప్పి భోజనం తరువాత తగ్గడం, ఉదరం ఉబ్బి ఒత్తిడిని తట్టుకోలేకపోవడం, కాలేయభాగంలో సాధారణ స్పర్శను కూడా భరించలేకపోవడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు.
 
 డాక్టర్‌ మురళి అంకిరెడ్డి
ఎం.డి. (హోమియో) 
స్టార్‌ హోమియోపతి
సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, దిల్‌సుక్‌నగర్‌, విజయవాడ,                 వైజాగ్‌, తిరుపతి
ఫోన్స్‌ : 90300  50456
         90300 74456