కాలేయ వాపు, హైపటైటిస్‌ హోమియోతో కనుమరుగు

19-08-13

 
మన దేశంలో మొత్తం జనాభాలో 10 శాతం మంది ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇది ప్రాణాంతకమైన జబ్బా అంటే అవుననే చెప్పాల్సి ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన హెపటైటిస్‌ను వెంట తీసుకుని వస్తుంది. జీవక్రియలకు సంబంధించిన మార్పుల్ని కలుగజేస్తుంది. అయితే హోమియో చికిత్సతో కాలేయ జబ్బులు కనుమరుగైపోతాయని, కాన్‌స్టిట్యూషనల్‌ విధానంలో చికిత్సతో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ రవికిరణ్‌.
 
ఫ్యాటీ లివర్‌లో ముఖ్యంగా రెండు రకాలుంటాయి.
1. ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ : ఆల్కాహాల్‌ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది వస్తుంది. 
2. నాన్‌ ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌: స్థూలకాయుల్లో, జీవక్రియల్లో అసంబద్ధమైన మార్పులు వచ్చినప్పుడు కాలేయంలో కొవ్వు చేరిపోతూ ఉంటుంది. 
 
ముఖ్యమైన కారణాలు
ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం ప్రధాన కారణం. బరువు పెరగడం, వ్యాయామం లేకపోవడం, కూర్చుని చేసే ఉద్యోగాలు, హై క్యాలరీ ఫుడ్‌ తీసుకోవడం, షుగర్‌, ఫ్యాట్‌ ఎక్కువగా తినడం, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, డయాబెటిస్‌ వంటివీ కారణమవుతాయి. హెచ్‌ఐవి, హెపటైటిస్‌ సి, యాంటీవైరల్‌ థెరపీలు,ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ల వల్ల కూడా సమస్య వస్తుంది.
 
ప్రధాన లక్షణాలు
వ్యాధి దశను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. మొదటి రెండు దశల్లో ఉన్నప్పుడు కొంత అజీర్తి, గ్యాస్‌ ఎక్కువగా ఉత్పత్తి కావడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం జరుగుతుంది. అడ్వాన్స్‌ స్టేజ్‌కు వెళ్లినట్లయితే అలసట, నిస్సత్తువ, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, వాంతులు, కాలేయం వాపు వంటి లక్షణాలుంటాయి. మెడపైన, చంకల ప్రాంతంలో నల్లగా మారడం, రంగు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
 
ఆల్కాహాల్‌తో సమస్య
పొట్ట ఉబ్బిపోవడం, నీరు చేరిపోవడం, కాళ్లు వాచిపోవడం, జాండిస్‌, కాలేయం పనిచేయకపోవడం, రక్తపు వాంతులు కావడం, నల్లటి రంగులో మల విసర్జన, మతిమరుపు, సిర్రోసిస్‌ వ్యాపించడం జరుగుతుంది. 
 
గుర్తించడమెలా? 
లివర్‌ ఫంక్షన్‌ టెస్ట్‌, అలా్ట్రసౌండ్‌ అబ్డామిన్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ ద్వారా కూడా తీవ్రతను గుర్తించవచ్చు. కొన్నిసార్లు లివర్‌ బయాప్సీ అవసరమవుతుంది. 
 
హోమియో చికిత్స
ఫ్యాటీ లివర్‌ జీవప్రక్రియకు సంబంధించిన లోపం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి జీవప్రక్రియలను దారిలో పెట్టగలిగితే వ్యాధి నుంచి సులభంగా బయటపడవచ్చు. జీవప్రక్రియలను గాడిలో పెట్టడానికి హోమియో మందులు అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం చేయాలి. గోదుమలు, రాగి, జొన్నలు, సజ్జలు తీసుకోవాలి. ఆల్కాహాల్‌ పూర్తిగా మానేయాలి.
 
హెపటైటిస్‌
కాలేయ వ్యాధులలో అత్యంత ప్రాణాంతకమైనది, తెలియకుండా వ్యాపించే జబ్బు ఇది. 
కారణాలు
వైరల్‌ హెపటైటిస్‌(హెపటైటిస్‌ బి, సి, ఇ) వల్ల, హెర్పిస్‌ వైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌, బ్యాక్టీరియా వల్ల వచ్చే అవకాశం ఉంది.
ఆల్కాహాల్‌
ఆటోఇమ్యూన్‌ హెపటైటిస్‌
నాన్‌ ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డి సీజ్‌ 
ఐరన్‌ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల 
గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ వల్ల, కాలేయానికి రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం
లక్షణాలు
హెపటైటిస్‌ లక్షణాలను రెండు రకాలుః
ఎక్యూట్‌ : ఇందులో వికారం, నొప్పులు, వాంతులు, తలనొప్పి, మూత్రం పచ్చగా రావడం, కళ్లు పసుపుగా మారడం, పొట్ట ఉబ్బరం, అజీర్తి వంటి లక్షణాలు.
క్రానిక్‌ : జ్వరం, ఒంటి నొప్పులు, జీర్ణశక్తి లోపించడం, అలసట, కాళ్లు వాయడం, పొట్టలో నీరు చేరడం, అంతర్గతంగా రక్తస్రావం వంటి లక్షణాలుంటాయి.
గుర్తుపట్టడమెలా?
రక్త పరీక్షలు( హెచ్‌బీఎస్‌ ఏజీ, హెచ్‌సీవీ, ఎల్‌ఎఫ్‌టీ), అలా్ట్రసౌండ్‌ అబ్డామిన్‌, సీటీస్కాన్‌,ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌, ఆల్ఫా ప్రొటీన్‌ టెస్ట్‌ వంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ.
హోమియో చికిత్స
కాలేయానికి ఉన్న ప్రధాన లక్షణం ఏమిటంటే, తనకు తానుగా కోలుకునే అవకాశం ఎక్కువ. చనిపోయిన కణాలను మళ్లీ పుట్టించగలదు. హోమియో వైద్యం ఇందుకు అద్భుతంగా పనిచేస్తుంది. 
ఫ్యాటీ లివర్‌, హెపటైటిస్‌ సమస్యలను సమూలంగా పారదోలే సత్తా హోమియో మందులకు ఉంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే కాలేయ వ్యాధులు  కనుమరుగైపోతాయి.
 
డాక్టర్‌ రవికిరణ్‌ 
ప్రముఖ హోమియో వైద్యనిపుణులు
మాస్టర్స్‌ హోమియోపతి
అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి,
హైదరాబాద్‌, విజయవాడ
ఫోన్‌ : 7842 106 106
        9032 106 106