అక్కడ రాళ్లు ఏర్పడితే...

16-09-2019:మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి హోమియోలో సమర్థమైన వైద్యం ఉంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడి, ఇసుక పొడిలా మూత్రంలోంచి బయటికి వస్తున్నప్పుడు లైకోపోడియం-200 మందు వేసుకుంటే సమస్య తొలగిపోతుంది.
కిడ్నీలోంచి రాళ్లు మూత్రనాళంలోకి జారుతున్నప్పుడు మంట, బాధ క లిగితే కెన్నబిస్‌ సతీవా - 30 మందు బాగా పనిచేస్తుంది.
చిన్న చిన్న రాళ్లు మూత్రనాళంలో చేరి, అతి కష్టంగా బయటికి వస్తున్నప్పుడు బాధ, మంటతో రోగి గిలగిలలాడుతుంటాడు. ఈ స్థితిలో డయస్కోరియా - 30 మందు వేసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఫాస్పేట్ల వల్ల కొందరి మూత్రంలో మడ్డి లాంటి పదార్థం విసర్జింపబడుతున్నప్పుడు యాసిడ్‌ ఫాస్‌ - 30 మందు వేసుకుంటే సమస్య తొలగిపోతుంది.
మూత్ర విసర్జనలో మంట, బాధ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కాల్కేరియా కార్బ్‌ - 30 మందు వేసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది.

- డాక్టర్‌ బి. అనిల్‌ కుమార్‌, హోమియో వైద్య నిపుణులు