కిడ్నీలు సురక్షితంగా!

04-09-2018: నిరంతరం పని చేస్తూ ఉండే కిడ్నీలను సురక్షితంగా కాపాడుకోవలసిన బాధ్యత మనదే! కాబట్టి వాటిలోని మలినాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కోసం ‘కి డ్నీ క్లెన్సింగ్‌’ జ్యూస్‌లు తాగుతూ ఉండాలి.
కాన్‌బెర్రీ జ్యూస్‌: మూత్రపిండాల సమస్యలకు ఇది దివ్యౌషధం. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను పారద్రోలి మూత్రాశయం, మూత్రమార్గాల్లోని బ్యాక్టీరియాను వెళ్లగొడుతుంది.
బీట్‌రూట్‌ జ్యూస్‌: దీన్లో యాంటీ కేన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలుంటాయి. మూత్రం క్షారత్వాన్ని తగ్గిస్తుంది.
పుచ్చరసం: దీన్లో 92 శాతం నీరు ఉంటుంది. ఈ రసం తాగితే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగి విసర్జించబడతాయి.