ఉప్పు తక్కువ తింటేనే కిడ్నీలకు రక్ష

09-04-2018: యుక్త వయస్సులో తక్కువ ఉప్పు తినండి.. కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పచ్చళ్లు, అప్పడాలు, చట్నీలు, నమకీన్‌ పదార్థాలకు దూరంగా ఉంటే మేలని ముంబై సఫీ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ అరుణ్‌ పి దోషి చెబుతున్నారు. చిప్స్‌, సమోసాల కంటే కనీసం 5 పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు, బాదం, పిస్తాలు తింటే ఎంతో మేలనేది డాక్టర్ల వాదన.