కాలేయాన్ని కడిగేస్తుంది..!

22-09-2018: జీలకర్రలో శరీరానికి కాలసినన్ని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో పాటు కొన్ని ముఖ్యమైన తైలాలు, ఫైటోకెమికల్స్‌ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కాలేయం లోని మలినాలను తొలగించడమే కాకుండా, జీర్ణశక్తినీ, వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి. ఇతర పోషకాలతో పాటు జీలకర్రలోని, విటమిన్‌-సి,కెరోటిన్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను నిలువరిస్తాయి. ఇందుకు ఒక టీస్పూను జీలకర్ర పొడి, అరస్పూను పటిక బెల్లంతో పరగడుపున తింటే చాలు!
శ్వాసకోశాల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లను, ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులను నియంత్రించ డంలో జీలకర్ర బాగా తోడ్పడుతుంది. జలుబు, దగ్గును తగ్గించడంలోనూ, ఛాతిలోని కఫాన్ని తొలగించడం లోనూ సమర్థవంతగా పనిచేస్తుంది. అందుకు స్పూను జీలకర్రను నీళ్లల్లో వేసి మరిగించి చల్లారాక తాగాలి.
జీలకర్రలోని కాపర్‌, జింక్‌, వంటివి ఎముక మజ్జను ఉత్తేజితం చేయడం ద్వారా, ఎర్ర రక్తకణాలు, ప్లేట్‌లెట్ల ఉత్పత్తి మెరుగవుతుంది.
రోజూ జీలకర్రను వాడటం వల్ల చర్మం కందిపోవడం, బొబ్బలు రావడం, మొటిమలు ఏర్పడటం వంటివి దాదాపు ఉండవు. జీలకర్రలో పాస్పరస్‌తో పాటు ఉండే క్యుమినాల్‌డిహైడ్‌, థైమాల్‌ వంటివి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి.