కిడ్నీల పనితీరుపై కన్నేయండి..

ఆంధ్రజ్యోతి, 07/07/15: రక్తాన్ని వడబోసి.. వ్యర్థాలను బయటకు పంపించేవి మూత్రపిండాలు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు కిడ్నీలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా షుగర్‌, బీపీ రోగస్తుల్లో కిడ్నీ ఫెయిల్యూర్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా రెండు లక్షలకు పైగా కిడ్నీ ఫెయిల్యూర్స్‌ నమోదవుతున్నాయి. కొన్ని ముందస్తు సూచనలతో కిడ్నీ వ్యాధులను గుర్తించవచ్చు. వెంటనే స్పందిస్తే వ్యాధి తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చు.

 దీర్ఘకాలంగా డయాబెటిక్‌, బ్లడ్‌ప్రెషర్‌తో బాధపడేవారిలో కిడ్నీ వైఫల్యం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 మూత్రపిండాల పనితీరులో కాస్త తేడా వస్తే.. చిన్నపని చేసినా తొందరగా అలసటకు గురవుతుంటారు.
 యూరిన్‌ పరిమాణం గణనీయంగా తగ్గినట్టు అనిపిస్తే కిడ్నీలు సరిగా పని చేయడం లేదని గ్రహించండి. మోకాళ్లు, పాదాల్లో వాపు వ స్తే.. అది కిడ్నీ వైఫల్యానికి తొలిమెట్టని తెలుసుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన డాక్టర్‌ను సంప్రదించడం వల్ల క్రానిక్‌ కిడ్నీ 
డిసీ్‌సకు దారి తీయకుండా కాపాడుకోవచ్చు.
 మూత్రం చిక్కగా రావడం, యూరిన్‌లో రక్తం కనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.
 కిడ్నీలు సరిగా పని చేయకపోతే ఎప్పుడూ యూరిన్‌ వస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంటుంది. అదే సమయంలో మూత్రవిసర్జన సరిగా 
జరగదు.
 కిడ్నీలు నిరంతరాయంగా రక్నాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. ఈ క్రియలో తేడా వస్తే.. నిద్రకూడా సరిగా పట్టదు. విషతుల్యమైన సీరమ్‌ క్రియేటినిన్‌, యూరియా వంటి రసాయనాలు యూరిన్‌తో పాటు వెళ్లిపోకుండా రక్తంలో కలిసిపోతుంటాయి. అదే సమయంలో శరీరానికి సత్తువనిచ్చే అల్బమిన్‌ యూరిన్‌లో కలిసిపోతుంది. తద్వారా మనిషి త్వరగా ఆయాసానికి గురవడంతో పాటు నిద్ర కూడా సరిగా పట్టదు. భోజనం చేసే సమయంలో విపరీతంగా చెమటలు వస్తుంటాయి.
యూరియా రక్తంలో కలవడం వల్ల చర్మం పొడిబారుతుంటుంది. దురద పెడుతుంది.
 కిడ్నీలపై ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వరకు నెఫ్రాన్స్‌ ఉంటాయి. ఇవి జల్లెడలా రక్తాన్ని ఫిల్టర్‌ చేస్తుంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్‌ వల్ల నెఫ్రాన్స్‌ రక్తంలోని పోషకాలను మూత్రం గుండా బయటకు పంపి, మలినాలను రక్తంలోకి చేరవేస్తాయి.
 కిడ్నీ వ్యాధిగ్రస్తులు కొబ్బరిబోండం, పళ్లరసాలను పూర్తిగా దూరం ఉంచాలి. వీటిలో ఉండే పొటాషియం వల్ల కిడ్నీలపై పనిభారం పెరిగి తొందరగా అలసిపోతాయి.
 కిడ్నీ పేషంట్లు ఉప్పును ఎంత దూరం ఉంచితే అంత మంచిది. శరీరంలో సోడియం లెవల్స్‌ పెరిగేకొద్దీ కిడ్నీల పనితీరు మందగిస్తుంది.
 విటమిన్‌-డి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది. దీనివల్ల ఎముకలు, 
కండరాల్లో శక్తి పెరుగుతుంది. 
 తెల్లగలిజేరు కూర ఎక్కువగా తీసుకోవాలి. ఇది కిడ్నీలకు పునరుత్తేజం కలిగిస్తుంది.