మాంసం మోతాదు మించి తింటే..

జెరూసలెం, మార్చి 21: నిల్వ ఉంచిన మాంసం ఎక్కువగా తీసుకుంటే కాలేయానికి ప్రమాదమని పరిశోధనలో వెల్లడైంది. మాంసం మోతాదుకు మించి తీసుకోవడం వల్ల నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ) వచ్చే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా పురుషుల్లో బీఎమ్‌ఐలో భారీ మార్పులు జరిగి జీవక్రియ దెబ్బతింటుందని ఇజ్రాయిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైఫా పరిశోధకులు వెల్లడించారు. ఎన్‌ఏఎ్‌ఫఎల్‌డీ ఉన్న వారికి కేన్సర్‌, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.