కిడ్నీ రోగుల ఆయుష్షును పెంచే కాఫీ

05-11-2017: మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు రోజూ కప్పు కాఫీ తాగితే మరణం ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్‌ వారి ఆయుష్షును పెంచుతుందని 2328 మందిపై నిర్వహించిన పరీక్షల్లో తేలిందని పోర్చుగల్‌కు చెందిన సెంట్రో హాస్పిటాలర్‌ లిస్బోవా నోర్ట్‌ పరిశోధకులు వెల్లడించారు. వయస్సు, లింగం, వార్షికాదాయం, శరీర రక్తపోటును పరిశీలించి, తగు మోతాదులో కాఫీ తాగించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.